ఇప్పటివరకు ఏ ఫోన్‌లో లేని కొత్త ఫీచర్లతో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్.. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం!!
రియల్‌మి సంస్థ తన కొత్త రియల్‌మి 12+ 5G స్మార్ట్‌ఫోన్‌ను (Realme 12+ 5G Smartphone) మార్చి 6వ తేదీన భారత్‌లో లాంచ్ చేయనుంది. అయితే తాజాగా సంస్థ ఈ హ్యాండ్‌సెట్ ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. మార్చి 6వ తేదీ తర్వాత ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన ఫీచర్లతో ఆకట్టుకుంటుందని సంస్థ చెబుతోంది.
రియల్‌మి 12+ 5G స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ ఫోన్ 50MP సోనీ LYT 600 OIS పొర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో ఈ కెమెరాలో ఫోన్ లాంచ్ కానుండడం తొలిసారని సంస్థ చెబుతోంది. 67W సూపర్‌వోక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

రియల్‌మి 12+ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ముందస్తు బుకింగ్‌లు ఇవాళ్టి నుంచి (ఫిబ్రవరి 29 తేదీ 2PM) ప్రారంభం అయ్యాయి. మార్చి 5 వరకు అవకాశం ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్టు, realme.com వెబ్‌సైట్ నుంచి బుకింగ్‌లు చేయవచ్చు.
రూ.2000 డిస్కౌంట్, అదనపు ప్రయోజనాలు : ఇవాళ్టి నుంచి మార్చి 5వ తేదీ మధ్య ముందస్తు బుకింగ్‌లు చేసుకున్నవారు అనేక ప్రయోజనాలు పొందుతారని రియల్‌మి సంస్థ తెలిపింది. రియల్‌మి 12+ ముందస్తు బుకింగ్‌పై రూ.1000 డిస్కౌంట్ ఆఫర్‌తోపాటు, రూ.1000 అదనపు తగ్గింపును పొందవచ్చు.
ఫ్లిప్‌కార్టు ద్వారా బుకింగ్ చేసుకుంటే 6 నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయం, సంవత్సరంపాటు మొబైల్ ప్రొటెక్షన్‌ను పొందవచ్చు. అదే రియల్‌మి వెబ్‌సైట్ నుంచి బుకింగ్ చేస్తే 9 నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయం సహా రూ.1149 విలువైన స్క్రీన్ డ్యామేజీ ప్రొటెక్షన్‌ను పొందవచ్చు. సంవత్సర కాలంపాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
రియల్‌మి 12 సిరీస్ తొలి సేల్ మార్చి 6 మధ్యా్హ్నం 3 గంటల నుంచి ప్రారంభమై.. 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొనుగోలుదారులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. రియల్‌మి పరికరాలు సహా ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రయోజనాలను పొందవచ్చు.
రియల్‌మి 12+ 5G స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సహా సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. గత మోడళ్లు కంటే 18 శాతం మెరుగైన కెమెరా పనితీరును కనబరుస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు 2X జూమింగ్ సామర్థ్యం కలిగిన మరో కెమెరాను కలిగి ఉంటుంది.
ఇప్పటివరకు ఏ ఫోన్‌లోనూ లేని.. :
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో లేని స్నాప్ పొర్ట్రెయిట్, యూనిక్ డైనమిక్ పొర్ట్రెయిట్ క్యాప్చర్ సిస్టమ్‌ను రియల్‌మి సంస్థ 12+ 5G స్మార్ట్‌ఫోన్ ద్వారా పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ల కారణంగా 0.8 సెకన్లలోనే ఫొటోలను క్యాప్చర్ చేయవచ్చు. మరియు గరిష్ఠంగా నిమిషానికి 208 ఫొటోలను క్యాప్చర్ చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications