Home
Mobile

రియల్‌మి 12 ప్రో సిరీస్‌ విడుదల తేదీ ఖరారు.. 120X సూపర్‌ జూమ్‌ సహా 200MP కెమెరా?

రియల్‌మి 12 ప్రో 5G సిరీస్‌ (Realme 12 Pro 5G Series) భారత్‌లో విడుదల కానుంది. జనవరి 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి 12 ప్రో, రియల్‌మి 12 ప్రో ప్లస్‌ ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా ఈ ఫోన్లు కొనుగోలుకు అందుబాటలో ఉంటాయని తెలుస్తోంది.

రియల్‌మి 12 ప్రో 5G సిరీస్‌ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రియల్‌మి ఈ స్మార్ట్‌ఫోన్ల గురించి అనేక వివరాలను వెల్లడిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 64MP Omnivision OV64B పెరీస్కోపిక్‌ లెన్స్‌తో రానుంది. మరో కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) తో సోనీ IMX890 సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

realme-12-pro-5g-series

రియల్‌మీ 12 ప్రో క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మి 12 ప్రో ప్లస్.. స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై రియల్‌మి నుంచి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఇప్పటి వరకు ఉన్న ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల కంటే పెద్ద లెన్స్‌ : రియల్‌మీ 12 ప్రో సిరీస్‌ కెమెరా సహా ఇతర స్పెసిఫికేషన్లు గురించి టీజర్లను ఇప్పటికే రియల్‌మి విడుదల చేసింది. 64MP పెరిస్కోపిక్‌ లెన్స్‌ 120X సూపర్‌ జూమ్‌ సపోర్టుతో వస్తుంది. 1/2 అంగుళాల సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇతర ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లతో పోలిస్తే 27.62 పెద్దదిగా ఉంటుందని రియల్‌మి సంస్థ పేర్కొంది.

realme-12-pro-5g-series

200MP కెమెరాను కలిగి ఉండే అవకాశం : అయితే రియ్‌మి 12 ప్రో సిరీస్‌ కూడా 200MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రియల్‌మి ఇండియా తన అధికారిక వెబ్‌ పేజీలో కెమెరా శాంపిల్‌లను షేర్‌ చేసింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్లు బ్లూ, క్రీమ్‌ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయని సమాచారం.

గీన్‌బెంచ్‌లో RMX3840 నంబర్‌తో : రియల్‌మీ 12 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ మోడల్‌ ఇటీవలే గీన్‌బెంచ్‌లో RMX3840 నంబర్‌తో గుర్తించబడింది. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 OSను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే రియల్‌మి 12 ప్రో స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

realme-12-pro-5g-series

5000mAh బ్యాటరీ ప్యాక్‌ : రియల్‌మి 12 ప్రో, రియల్‌మి 12 ప్రో ప్లస్‌ రెండు మోడళ్లు 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలుస్తోంది. మరియు 6.7 అంగుళాల కర్వడ్‌ ఎడ్జ్‌ పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీప్రెష్‌ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 12 Pro 5G series launch confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X