Home
Mobile

64MP టెలిఫోటో కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌..!!

రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024 లో (Flipkart Big Saving Days Sale 2024) భాగంగా భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌ మే 2న ప్రారంభం కాగా.. మే 9 మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్ సహా కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది.

రియల్‌మి 12 ప్రో ప్లస్‌ ధర..
రియల్‌మి 12 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ (Realme 12 Pro Plus Smartphone) 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.31,999 మరియు 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.

Realme 12 Pro Plus smartphone attracts with huge discount in flipkart big saving days sale 2024

ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ 2024లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. Buy More Save More ఆఫర్ ద్వారా రూ.2000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను మూడు రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. సబ్‌మెరైన బ్లూ, ఎక్స్‌ప్లోరర్‌ రెడ్‌ మరియు నావిగేటర్‌ బీజ్‌ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

రియల్‌మి 12 ప్రో+ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్‌ HD+ OLED కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 950 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 67W SuperVooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

రియల్‌మి 12 ప్రో+ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 CPU అడెన్నో 710 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంది. మెరుగైన మల్టీ మీడియా సపోర్టు కోసం డాల్బీ ఆట్మా్స్‌ ఆధారిత స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ 32MP కెమెరాను కలిగి ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్‌ డేస్‌ సేల్ 2024 మే 2న ప్రారంభం అయింది. మే 9 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు సహా ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. SBI క్రెడిట్‌ కార్డు ద్వారా 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 12 Pro Plus smartphone attracts with huge discount in flipkart big saving days sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X