ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్.. 32MP టెలీఫోటో కెమెరా, 5000mAh బ్యాటరీ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్..!
రియల్‌మి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ (Realme 12 pro smartphone Price drop) ఈ సంవత్సరం జనవరిలో భారత్‌లో విడుదల అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2024 లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ టెలీఫోటో సెన్సార్ సహా మెరుగైన బ్యాటరీని కలిగి ఉంది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే ఈ హ్యాండ్‌సెట్ మంచి ఆప్షన్ కానుంది.
రియల్‌మి 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో రూ.25,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.4000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.21,999 కే కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనూ అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లతోపాటు యాక్సెస్, HDFC, ICICI, SBI బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. అదే 12GB వేరియంట్ కొనుగోలు చేసిన సమయంలో ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.1000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ నావిగేషన్ బీజ్ మరియు సబ్‌మెరైన్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి 12 ప్రో స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనేలా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS పైన పనిచేస్తుంది. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో పాటు Adreno 710 GPU ప్రాసెసర్‌తో జతచేయబడింది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 67W SuperVooc ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
రియల్‌మి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంది. 8MP అల్ట్రావైడ్ + 32MP టెలీఫోటో కెమెరాతో లాంచ్ కానుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాలను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.2, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌తో కలిగి ఉంటుంది. దీంతోపాటు డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్‌లు మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








