రియల్‌మి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధర లీక్.. ఐఫోన్ తరహా ఫీచర్‌తో రేపే విడుదల..!
రియల్‌మి సంస్థ భారత్‌లో రియల్‌మి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను (Realme 12 Series Smartphones) రేపు (మార్చి 6న) విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 12 5G మరియు రియల్‌మి 12+ 5G హ్యాండ్‌సెట్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల ధరల వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ సుదన్షు ఈ రెండు ఫోన్ల ధరలను షేర్ చేశారు.
రియల్‌మి 12, 12+ 5G ధర..! : టిప్‌స్టర్ నివేదిక ఆధారంగా రియల్‌మి 12 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.18,999 ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ ట్విలైట్ పర్పల్ మరియు వుడ్‌ల్యాండ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి వస్తుందని సమాచారం.

రియల్‌మి 12+ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ నేవిగేటర్ బీజ్ మరియు పైనీర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. దీనిపై రియల్‌మి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
రియల్‌మి 12+ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి 5.0 skin పైన పనిచేసే అవకాశం ఉంది. మరియు మీడియాటెక్ 7050 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
దీంతోపాటు ఈ రియల్‌మి 12+ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 67W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది.
రియల్‌మి 12 స్మార్ట్‌ఫోన్ డైనమిక్ బటన్‌ను కలిగి ఉంటుంది. ఈ తరహా యాక్షన్ బటన్ ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో చూడవచ్చు. మరియు ఈ ఫోన్ 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీలను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 OS సహా మీడియాటెక్ 7050 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
రియల్‌మి 12 5G, రియల్‌మి 12+ 5G స్మార్ట్‌ఫోన్లు భారత్ మార్కెట్‌లో మార్చి 6న లాంచ్ కానున్నాయి. అయితే పైన తెలిపిన స్పెసిఫికేషన్లు, ధరలు కొన్నింటిపై రియల్‌మి సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరియు ఈ ఫోన్ల సేల్ వివరాలు కూడా విడుదల సమయంలో రియల్‌మి ప్రకటన చేయనుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








