తక్కువ ధరలో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారు.. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్స్ సహా కీలక ఫీచర్లు..!
రియల్‌మి భారత్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. త్వరలో రియల్‌మి 12X 5G స్మార్ట్‌ఫోన్‌ను (Realme 12X 5G Smartphone Launch) భారత్‌లో ఆవిష్కరించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో స్మార్ట్‌ఫోన్ ధర విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ ఏప్రిల్ 2 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నారు.
రియల్‌మి 12X 5G స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రియల్‌మి అధికారిక ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా లైవ్ చూడవచ్చు. దీంతోపాటు సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా లైవ్ వీక్షించవచ్చు. అయితే ఈ హ్యాండ్ సెట్‌కు సంబందించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. వీటిని రియల్‌మి కూడా ధ్రువీకరించింది.

30 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్ :
రియల్‌మి 12X 5G స్మార్ట్ ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సపోర్టును కలిగి ఉంది. సంస్థ ప్రకారం కేవలం 30 నిమిషాల్లో 0-50 శాతం ఛార్జింగ్ చేయవచ్చని తెలిపింది. తక్కువ ధర సెగ్మెంట్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తోంది.
ఈ సెగ్మెంట్‌లో డ్యూయల్ స్పీకర్లు :
దీంతోపాటు రియల్‌మి కొన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించింది. 120Hz డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని ప్రకటన చేసింది. ఈ సెగ్మెంట్‌లో మెరుగైన ఫీచర్‌గా గుర్తించవచ్చు. దీంతోపాటు 6nm 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు ఈ సెగ్మెంట్‌లో డ్యూయల్ స్పీకర్లు కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ రియల్‌మి 12X 5G మాత్రమేనని సంస్థ తెలిపింది.

అడ్వాన్సడ్ VC కూలింగ్ టెక్నాలజీ :
ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో తొలిసారిగా రియల్‌మి 12X 5G ఫోన్ అడ్వాన్సడ్ VC కూలింగ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో పాటు డైనమిక్ బటన్ మరియు ఎయిర్ గెశ్చర్స్ కూడా కలిగి ఉంటాయని సంస్థ తెలిపింది.
ఈ ఫోన్‌ను ఎంట్రీ లెవల్ హ్యాండ్ సెట్‌గా రియల్‌మి పేర్కొంది. గత సంవత్సరం రియల్‌మి 11X 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.12,999 కే విడుదల అయింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది.
వృత్తాకార మెటల్ కెమెరా మాడ్యూల్ :
ఈ స్మార్ట్ ఫోన్ వృత్తాకార మెటల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ఆధారంగా ఈ ఫోన్ ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. అయితే ఈ హ్యాండ్ సెట్ మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








