50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!
రియల్‌మి 12X స్మార్ట్ ఫోన్ (Realme 12X Smartphone Launched) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 మరియు 50MP డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ అయింది.
రియల్‌మి 12X స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 పైన పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 12GB ర్యామ్‌తో జతచేయబడి ఉంది. మరియు డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా 24GB ర్యామ్ వరకు పొడిగించుకోవచ్చు.

6.67 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ :
ఈ రియల్‌మి 12X స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ తో లాంచ్ అయింది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
రియల్‌మి 12X 5G స్మార్ట్ ఫోన్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP కెమెరాను కలిగి ఉంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాలను కలిగి ఉంది. కనెక్టివిటి పరంగా 5G, వైఫై, బ్లూటూత్, GPS, USB-C ఛార్జింగ్ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
రియల్‌మి 12X 5G స్మార్ట్ ఫోన్ స్టోరేజీ వేరియంట్లు :
ఈ రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ మరియు 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీలో అందుబాటులో ఉంటుంది. అయితే ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.
రియల్‌మి 12X 5G 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర CNY (భారత కరెన్సీ ప్రకారం రూ.16,000), అదే 12GB ర్యామ్ +512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 1599 (భారత కరెన్సీ ప్రకారం రూ.18,000) గా ఉంది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే విడుదల అయింది. భారత్‌లోనూ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








