రియల్‌మి 12X 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక సేల్ ప్రారంభం.. రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు..!
రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్‌లో ఇటీవల Realme 12X 5G స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్ రూ.11,999 గా విడుదల అయింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఎయిర్ గెశ్చర్ ఫీచర్, డైమమిక్ బటన్‌ను కలిగి ఉంది.
రియల్‌మి 12X 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేక సేల్ (Realme 12X 5G Special Sale) ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయింది. ఇవాళ 2PM గంటలకు వరకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ వేరియంట్‌ను రూ.10,999 మరియు 6GB ర్యామ్ వేరియంట్‌ను రూ.11,999 కి కొనుగోలు చేయవచ్చు.

ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు :
అయితే ఏప్రిల్ 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాధారణ సేల్ ప్రారంభం కానుంది. ICICI, SBI, HDFC బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లు వుడ్‌ల్యాండ్ గ్రీన్, ట్విలైట్ పర్పల్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే :
రియల్‌మి 12X 5G స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్ సహా 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన విజువల్ అనుభూతి కలుగుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత realme UI 5 పైన పనిచేస్తుంది.
VC కూలింగ్ సిస్టమ్ :
ఈ హ్యాండ్ సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. గేమింగ్ సహా ఇతర సమయాల్లో ఫోన్ వేడెక్కినప్పుడు VC కూలింగ్ సిస్టమ్ ద్వారా హ్యాండ్‌సెట్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 50MP AI ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా 45W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తి చేయవచ్చని సంస్థ తెలిపింది. రివర్స్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 35 గంటల కాలింగ్ లేదా 15 గంటలపాటు వీడియో స్ట్రీమింగ్ బ్యాకప్‌ను పొందుతుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications