రియల్‌మి నుంచి AI కెమెరాలతో కొత్త స్మార్ట్‌ఫోన్ ఫోటో విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు..!!
రియల్‌మి నుంచి మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. ఇటీవల కాలంలో రియల్‌మి ఎంట్రీ లెవల్ మోడళ్లు సహా మిడ్‌రేంజ్ హ్యాండ్‌సెట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో లాంచ్ చేస్తోంది. తాజాగా రియల్‌మి 13 ప్రో 5G సిరీస్ (Realme 13 pro 5G series)స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో ఆవిష్కరించనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 13 ప్రో 5G, రియల్‌మి 13 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌లు భారత్ మార్కెట్‌లో లాంచ్ కానున్నాయి.
అయితే రియల్‌మి 13 ప్రో 5G హ్యాండ్‌సెట్ విడుదల తేదీ సహా ఇతర స్పెసిఫికేషన్‌లను సంస్థ వెల్లడించలేదు. ఈ కొత్త హ్యాండ్‌సెట్.. గత సంవత్సరం జనవరిలో లాంచ్ అయిన రియల్‌మి 12 ప్రో సిరీస్‌కు తర్వాత తరం వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది. అయితే రియల్‌మి 13 ప్రో 5G సిరీస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.

రియల్‌మి ఈ 13 ప్రో 5G సిరీస్ తాజాగా బ్యానర్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కెమెరా మాడ్యుల్ వద్ద గోల్డ్ రంగుల్లో Hyperimage అనే పదాన్ని కూడా గుర్తించవచ్చు. పవర్, వాల్యూమ్ బటన్లలో మార్పులను గమనించవచ్చు.
రియల్‌మి 13 ప్రో 5G సిరీస్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
తాజాగా వచ్చిన బ్యానర్‌లో ఈ హ్యాండ్‌సెట్ AI ఆధారిత కెమెరాలను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. మరియు ఏ ఫోన్‌లలో ఇప్పటి వరకు లేని ఫీచర్‌లతో లాంచ్ కానుందని తెలిపింది. దీంతోపాటు First Professional AI Camera పేరుతో ఈ ప్రమోషనల్ బ్యానర్‌ను రియల్‌మి లాంచ్ చేసింది.
గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా రియల్‌మి 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. త్వరలో ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు సహా ఇతర వివరాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
* ఇవాళ రియల్‌మి C63 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. జులై 3 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం కానుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ను ఒక్క నిమిషం పాటు ఛార్జింగ్ చేసి, గంటపాటు ఫోన్ కాల్ మాట్లాడుకొనే వీలుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు గ్రీన్, బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రియల్‌మి C63 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1600 పిక్సల్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్, 450 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు Unisoc T612 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీతో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI పైన పనిచేస్తుంది.
50MP ప్రధాన కెమెరా సహా 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.8,999 గా ఉంది. లెదర్ బ్లూ, జాడే గ్రీన్ రంగులో కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








