Home
Mobile

50MP + 50MP కెమెరాలతో రియల్‌మి 13 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి.. తొలిసారిగా..!!

రియల్‌మి నుంచి ఈ సంవత్సరంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి మిడ్‌ రేంజ్ వరకు అనేక హ్యాండ్‌సెట్‌లను లాంచ్‌ చేసింది. తాజాగా రియల్‌మి 13 ప్రో సిరీస్‌ను (Realme 13 Pro 5G Series India Launch Date) భారత్‌లో విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో రియల్‌మి 13 ప్రో 5G, ప్రో ప్లస్‌ 5G మోడళ్లు జులై 30 న లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

రియల్‌మి 13 ప్రో 5G, ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌లు AI ఫొటోగ్రఫీ ఆర్కిటెక్చర్‌ను లాంచ్ కానుంది. దీంతోపాటు ఈ సిరీస్‌లో ఫొటోగ్రఫీకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రో ప్లస్ మోడల్ అత్యంత నాణ్యమైన ఫొటోగ్రఫీని అందిస్తుందని తెలుస్తోంది. ప్రో ప్లస్‌ మోడల్‌ డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలా వివిధ లైటింగ్‌ కండిషన్‌లలో నాణ్యమైన ఫోటోలను అందిస్తాయి.

Realme 13 pro 5G series Smartphones confirmed to launch in india on july 30

రియల్‌మి 13 ప్రో 5G సిరీల్‌ అద్భుతమైన కెమెరా ఫీచర్లు :
రియల్‌మి 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme 13 Pro 5G Smartphone) 3 లేయర్‌ AI ఇమేజింగ్‌తో కూడిన HYPERIMAGE+ కెమెరా వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ డివైస్‌ మరియు క్లౌడ్‌ ఆధారిత AI ఇమేజింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

ఈ ప్రో+ 5G మోడల్‌ తొలిసారిగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT-701 కెమెరా మరియు 3X జూమింగ్ సామర్థ్యంతో 50MP సోనీ 600 పెరిస్కోప్‌ టెలిఫొటో కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ రెండు కెమెరాలు TUV Rheinland హై రిజల్యూషన్‌ కెమెరా సర్టిఫికేషన్‌ను పొందింది.

Realme 13 pro 5G series Smartphones confirmed to launch in india on july 30

ఈ రియల్‌మి 13 ప్రో 5G సిరీస్‌ గ్లాస్‌ ప్యానల్‌ కలిగిన ఎడిషన్‌ మోనెట్‌ గోల్డ్‌, మోనెట్‌ పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది. అదే వేగాన్ లెదర్‌ ఆప్షన్‌లో ఎమరాల్డ్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ రియల్‌మి 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ మిగిలిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

*భారత్‌లో ఇటీవల రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్‌ మిరాకల్‌ పర్పుల్‌ కలర్‌ వేరియంట్ విడుదల అయింది. దీంతోపాటు ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ఫ్లూయిడ్‌ సిల్వర్‌, రజ్రో గ్రీన్‌ కలర్‌ లభిస్తుంది. ఈ కొత్త కలర్ వేరియంట్ సేల్ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ realme.com, అమెజాన్ సహా ఇతర ఆఫ్‌లైన్‌ రిటైల్‌ దుకాణాల్లో అందుబాటులో ఉంటుంది.

Realme 13 pro 5G series Smartphones confirmed to launch in india on july 30

ఈ మిరాకల్‌ పర్పుల్‌ కలర్‌ వేరియంట్‌.. కేవలం 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.32999, 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.35999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 13 pro 5G series Smartphones confirmed to launch in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X