50MP+ 50MP + 8MP కెమెరాలు, 5200mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. రూ.3000 డిస్కౌంట్..!
రియల్‌మి 13 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో జులై 30 విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 13 ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఇవాళ్టి నుంచి కొనుగోలుకు (Realme 13 Pro Series Sale) అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు స్టీరియో స్పీకర్లతో అందుబాటులో ఉంటుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రియల్‌మి 13 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ 7i రక్షణను కలిగి ఉంటుంది.

రియల్‌మి 13 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ SoC పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB అంతర్గత స్టోరేజీ జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3D VC కూలింగ్ సిస్టమ్ మరియు SGS 5 స్టార్ డ్రాప్ రిసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
రియల్‌మి 13 ప్రో హ్యాండ్‌సెట్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ LYT 600, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రియల్‌మి 13 ప్రో+ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి 13 ప్రో+ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ అందుబాటులో ఉంది. మరియు డిస్‌ప్లే రక్షణ కోసం గొరెల్లా గ్లాస్ 7i రక్షణను కలిగి ఉంటుంది.
ఈ ప్రో ప్లస్ మోడల్ స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 SoC పైన పనిచేస్తుంది. మరియు 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 5.0 పైన పనిచేస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
రియల్‌మి 13 ప్రో + స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్ సపోర్టుతో 50MP సోనీ LYT 701 కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 50MP సోనీ LYT 600 పెరిస్కోప్ లెన్స్, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
రియల్‌మి 13 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. 8GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి 13 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36999 గా ఉంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రియల్‌మి 13 ప్రో సిరీస్‌ను ICICI, HDFC, SBI బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ప్రో మోడల్ ఎమరాల్డ్ గ్రీన్, మానెట్ పర్పుల్, మానెట్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. అదే ప్రో ప్లస్ మోడల్ ఎమరాల్డ్ గ్రీన్, మానెట్ గోల్డ్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








