Home
Mobile

రియల్‌మి 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల సేల్ ప్రారంభం.. ఈ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1500 తగ్గింపు.!

రియల్‌మి నుంచి గత వారం రియల్‌మి 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 13 మరియు 13+ హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ అయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ల సేల్‌ ప్రారంభం (Realme 13 5G Series Sale on Flipkart) అయింది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ మరియు ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా డిస్కౌంట్‌లను పొందవచ్చు.

రియల్‌మి 13 5G సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
రియల్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

Realme 13 Series Smartphones sale is live on Flipkart

అదే రియల్‌మి 13+ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22,999 గా ఉంది. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది.

రియల్‌మి 13 5G హ్యాండ్‌సెట్‌ కొనుగోలుపై రూ.1000 తగ్గింపును పొందవచ్చు. అదే 13+ 5G మోడల్‌పై రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. బేస్‌ వేరియంట్‌ డార్క్‌ పర్పుల్‌, స్పీడ్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ప్లస్‌ మోడల్‌ విక్టరీ గోల్డ్, డార్క్‌ పర్పుల్‌, స్పీడ్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

Realme 13 Series Smartphones sale is live on Flipkart

రియల్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి 13 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మి UI OS పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 18GB ర్యామ్, 256GB స్టోరేజీ వరకు సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ బేస్‌ వేరియంట్‌ 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రియల్‌మి 13+ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి 13+ 5G స్మార్ట్‌ఫోన్‌ 129Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 26GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

ఈ ప్లస్ మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ సెన్సార్‌, 2MP మోనోక్రోమ్‌ సెన్సార్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. మరియు 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 13 Series Smartphones sale is live on Flipkart specs features price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X