6000mAh బ్యాటరీ. 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్..!
రియల్‌మి P3 సిరీస్ నుంచి భారత్ మార్కెట్‌లో రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఈ నెల 19 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. అయితే గ్లోబల్ మార్కెట్‌లో రియల్‌మి 14 5G స్మా్ర్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను రియల్‌మి విడుదల చేసింది. సిల్వర్ కలర్ ఆప్షన్‌లో ఫోటోను షేర్ చేసింది.
రియల్‌మి లాంచ్ చేసిన (Realme 14 5G Smartphone) ఫోటో ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డిజైన్ వివరాలు వెల్లడయింది. అయితే ఈ డిజైన్ ఆకట్టుకుంటోంది. గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్ అయ్యాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఫలితంగా వీడియో ఎడిటింగ్, గేమింగ్ సమయంలో మెరుగైన పనితీరును కనబరిచే అవకాశం ఉంది. రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో లభించే అవకాశం ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
The Mecha design of the realme 14 Series 5G is making its debut, showcasing a stunning blend of futuristic aesthetics and cutting-edge technology. Does it resonate with you?#realme14Series5G #PerformanceDominator pic.twitter.com/Cqc9Fk0kDb
— realme Global (@realmeglobal) March 12, 2025
మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ పింక్, సిల్వర్, టైటానియం రంగుల్లో లభిస్తుంది.
దీంతోపాటు కెమెరా పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని సమాచారం. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చి ఉండే అవకాశం ఉంది.
అయితే రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. సుమారుగా ఇవే స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతో మార్చి 19న రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. అయితే రియల్ 14 స్మార్ట్‌ఫోన్‌పై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మార్చి 19 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. చిప్‌సెట్ గరష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 తో జతచేసి ఉంటుందని తెలిపింది.
ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అల్ట్రా స్మూత్ పనితీరును అందిస్తుందని సంస్థ చెబుతోంది. మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








