ప్రపంచంలోనే తొలిసారిగా కలర్ ఛేంజింగ్, ట్రిపుల్ ఫ్లాష్ యూనిట్‌తో స్మార్ట్‌ఫోన్‌లు.. రేపే విడుదల..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ రియల్‌మి నుంచి రేపు భారత్ మార్కెట్‌లోకి రియల్‌మి 14 ప్రో సిరీస్ సహా రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC (Realme Buds Wireless 5 ANC) విడుదల కానున్నాయి. రియల్‌మి 14 ప్రో సిరీస్‌లో (Realme 14 Pro 5G Series) భాగంగా రియల్‌మి 14 ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ సహా సోషల్ మీడియా వేదికల ద్వారా ఈవెంట్ లైవ్ చూడవచ్చు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది.
ప్రపంచంలోనే తొలిసారిగా :
ఇప్పటికీ ఈ సిరీస్, బడ్స్ డిజైన్‌ను రియల్‌మి టీజ్ చేసింది. దీని ఆధారంగా రియల్‌మి 14 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచంలోనే తొలిసారిగా ట్రిపుల్ ప్లాష్ యూనిట్‌ను కలిగి ఉంటుందని రియల్‌మి తెలిపింది. దీంతోపాటు కోల్డ్ సెన్సిటివ్ కలర్ ఛేంజింగ్ డిజైన్‌తో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.

రెండు ప్రత్యేక కలర్ వేరియంట్స్ :
ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం నాలుగు రంగుల్లో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానుండగా.. అందులో రెండు ప్రత్యేక కలర్ వేరియంట్స్ ఉండనున్నాయని రియల్‌మి తెలిపింది. IP66+ IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ కానుంది.
స్మార్ట్‌ఫోన్‌ల ధరల వివరాలు :
తాజాగా ఈ ఫోన్ ధరల వివరాలు లీక్ అయ్యాయి. రియల్‌మి 14 ప్రో 5G హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.26,999 గా ఉండే అవకాశం ఉంది. అదే ప్రో ప్లస్ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే విడుదల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటన చేసే అవకాశం ఉంది.

6000mAh బ్యాటరీ :
రియల్‌మి 14 ప్రో 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్, ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని రియల్‌మి వెల్లడించింది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది.
తొలిసారిగా ట్రిపుల్ ఫ్లాష్ యూనిట్ :
దీంతోపాటు ప్రపంచంలోనే తొలిసారిగా ట్రిపుల్ ఫ్లాష్ కలిగిన ఫోన్‌గా రియల్‌మి 14 ప్రో 5G సిరీస్ విడుదల కానుందని సంస్థ తెలిపింది. ఫోన్‌లతోపాటు రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్ విడుదల కానుంది. గ్రే, యెల్లో లభించనుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 38 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని తెలిపింది.

ఈ నెక్‌బ్యాండ్ 50dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్, ENC ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. అడాప్టివ్ 3 లెవల్ నాయిస్ రిడక్షన్ మరియు 400Hz అల్ట్రా వైడ్ బాండ్‌ను సపోర్టు చేస్తుంది. IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా రేపు భారత్‌లో విడుదల కానుంది. అయితే ధర వివరాలు వెల్లడి కాలేదు.
రియల్‌మి 14 ప్రో 5G, 14 ప్రో ప్లస్ 5G ఫోన్‌లు సహా బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్‌కు సంబంధించిన మరిన్ని కచ్చితమైన వివరాలు సహా సేల్ వివరాలు రేపు మధ్యా్హ్నం 12 గంటలకు వెల్లడి కానున్నాయి. మిడ్ రేంజ్ ధరల సెగ్మెంట్‌లో గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








