Home
Mobile

ట్రిపుల్‌ ఫ్లాష్‌, కలర్‌ చేంజింగ్ టెక్నాలజీ వంటి సూపర్‌ ఫీచర్‌లతో రియల్‌మి సిరీస్‌.. విడుదల తేదీ వెల్లడి..!

రియల్‌మి నుంచి కొత్త సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు (Realme 14 Pro 5G series Launch Date) భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానున్నాయి. రియల్‌మి 14 ప్రో సిరీస్‌ విడుదల తేదీ తాజాగా వెల్లడైంది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో + హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ కానున్నాయి. డిజైన్‌ ఆకట్టుకుంటోంది. రెండు ప్రత్యేకమైన రంగుల్లో లభించనుంది. దీంతోపాటు కలర్‌ చేంజింగ్ టెక్నాలజీ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. 6000mAh బ్యాటరీతో విడుదల కానుందని తెలుస్తోంది.

రియల్‌మి 14 ప్రో, ప్రో ప్లస్‌ వేరియంట్ భారత్‌ మార్కెట్‌లో జనవరి 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ మరియు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. తాజాగా విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ కలర్ వేరియంట్లు ఆకట్టుకుంటున్నాయి.

Realme 14 Pro 5G series smartphones news

రియల్‌మి 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి 14 ప్రో సిరీస్ 1.5K రిజల్యూషన్‌తో క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 3840 PWM డిమ్మింగ్‌తో వస్తుంది మరియు స్లిమ్‌ బెజెల్స్‌ను కలిగి ఉంటుంది.

రియల్‌మి 14 ప్రో+ మోడల్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని ఇప్పటికే సంస్థ వెల్లడించింది. అయితే బేస్‌ వేరియంట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. OS వివరాలు మరియు స్టోరేజీ వేరియంట్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Realme 14 Pro 5G series smartphones news

ఈ సిరీస్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ ఫ్లాష్‌ కలిగిన ఫోన్‌గా లాంచ్ కానుందని సంస్థ చెబుతోంది. ఫలితంగా నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చని తెలుస్తోంది. అయితే కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6000mAh బ్యాటరీతో విడుదల కానున్నాయని తెలుస్తోంది.

ఈ సిరీస్‌ నాలుగు కలర్‌ వేరియంట్లలో లభించనుంది. పెర్ల్‌ వైట్‌, బికనీర్‌ పర్పుల్‌, జైపూర్‌ పింక్‌, స్పీడ్‌ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. పెర్ల్‌ వైట్ కలర్‌ వేరియంట్ కలర్‌ చేంజింగ్‌ టెక్నాలజీతో విడుదల కానుందని తెలుస్తోంది. IP66, IP68, IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

Realme 14 Pro 5G series smartphones news

గత నెలలో రియల్‌మి నుంచి అద్భుతమైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతో రియల్‌మి 14X 5G హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.14999 గా ఉంది. గ్లోల్డెన్‌ గ్లో, క్రిస్టల్‌ బ్లాక్‌, జ్యువెల్‌ రెడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. సంవత్సరం వారంటీని పొందవచ్చు.

రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 5.0 ను కలిగి ఉంటుంది. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా 50MP OmniVision OV50D ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఎయిర్‌ గెశ్చర్స్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 14 Pro 5G series smartphones launch date revealed in india with super camera features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X