Home
Mobile

రంగులు మార్చే ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది.. ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు..!

భారత్‌ మార్కెట్‌లోకి ఇటీవల రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ (Realme 14 Pro 5G Series sale) స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఇందులో భాగంగా రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్‌ 5G హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌ ప్రపంచంలోనే తొలిసారిగా ట్రిపుల్‌ ఫ్లాష్‌ ను కలిగి ఉంది. మరియు కలర్‌ ఛేంజింగ్‌ బ్యాక్ ప్యానల్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ల సేల్‌ ప్రారంభం అయింది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ realme.com, ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. అదే ప్రో మోడల్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంది.

Realme 14 Pro 5g series sale

రియల్‌మి 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ సేల్‌లో భాగంగా రూ.2000 బ్యాంకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్ ధర రూ.22,999 గా ఉండనుంది. అదే ప్రో ప్లస్‌ మోడల్‌ 8GB ర్యామ్‌ వేరియంట్స్‌పై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే 12GB ర్యామ్ వేరియంట్‌పైన రూ.4000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఈ సిరీస్‌ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి జనవరి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు అవకాశం ఉంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా అధికారిక స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Realme 14 Pro 5g series sale

ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా తగ్గింపును పొందవచ్చు. రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ బేస్‌ వేరియంట్‌ జైపూర్‌ పింక్‌, పెర్ల్‌ వైట్‌, సూడో గ్రే రంగుల్లో లభిస్తుంది. అదే టాప్‌ ఎండ్‌ వేరియంట్ బికనీర్‌ పర్పుల్‌, పెర్ల్‌ వైట్‌, సూడో గ్రే రంగుల్లో లభిస్తుంది.

రియల్‌మి 14 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.77 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 7i రక్షణతో లాంచ్‌ అయింది.

Realme 14 Pro 5g series sale

ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలు సహా ట్రిపుల్‌ ఫ్లాష్‌ను కలిగి ఉంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

రియల్‌మి 14 ప్రో ప్లస్‌ 5G పూర్తి వివరాలు :
ఈ టాప్‌ ఎండ్‌ వేరియంట్ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 7i రక్షణను పొందుతుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0, స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను అమర్చారు. 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా (OIS), 8MP సోనీ IMX896 అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 3X ఆప్టికల్‌ జూమ్‌, 6X లాస్‌లెస్‌ జూమ్‌తో 50MP సోనీ IMX882 కెమెరాను (OIS) కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ట్రిపుల్‌ ఫ్లాష్‌తో లాంచ్‌ అయింది.

ఈ సిరీస్ కలర్‌ ఛేజింగ్‌ బ్యాక్‌ ప్యానల్‌తో అందుబాటులో ఉంది. పరిసరాల ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఫోన్‌ బ్యాక్ ప్యానల్ కలర్‌ వైట్‌ నుంచి బ్లూ లోకి మారుతుంది. అయితే క్రమంగా ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే పెరుగుతున్నప్పుడు మళ్లీ బ్లూ నుంచి వైట్ కలర్‌లోకి మారుతుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, ‌బ్లూటూత్‌ 5.2, వైఫై 6, GPS, QZSS, Glonass, Beidou, Galileo, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ Hi-Res సర్టిఫికేషన్‌తో కూడిన డ్యూయల్‌ స్పీకర్లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. IP66+IP68+IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 14 Pro 5g series Smartphone sale is live on flipkart and realme india website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X