Home
Mobile

సూపర్‌ డిజైన్‌, AI కెమెరా ఫీచర్‌లతో కొత్త 5G ఫోన్‌ను విడుదల చేసిన రియల్‌మి.. ధర, సేల్‌ వివరాలు..!

రియల్‌మి నుంచి తాజాగా మరో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. రియల్‌మి 14 ప్రో లైట్‌ 5G పేరుతో (Realme 14 Pro Lite 5G Smartphone Launched) అందుబాటులోకి వచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ వచ్చింది. తాజాగా లైట్‌ వేరియంట్‌ లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు IP65 రేటింగ్‌తోపాటు శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది.

రియల్‌మి కొత్త 5G హ్యాండ్‌సెట్‌ డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. మరియు స్టైలిష్‌ లుక్‌తో ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ గ్లాస్‌ గోల్డ్‌ మరియు గ్లాస్‌ పర్పుల్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరా ఫీచర్‌లు కలిగి ఉంది.

Realme 14 Pro Lite 5G

రియల్‌మి 14 ప్రో లైట్ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల OLED FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని జరగకుండా ఉండేలా ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i తో రక్షణ పొందుతుంది.

చిప్‌సెట్‌ :
రియల్‌మి 5G ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం Adreno 710 GPU చిప్‌సెట్‌ను కూడా అమర్చారు. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. అయితే అదనంగా 8GB ర్యామ్ వరకు పొడిగించుకోవచ్చు.

Realme 14 Pro Lite 5G

రెండు స్టోరేజీ వేరియంట్స్‌ :
ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3D VC కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా ఫీచర్‌లు :
ఈ రియల్‌మి ఫోన్‌లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత Hyperimage+ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. ఈ రియల్‌మి 14 ప్రో లైట్‌ 5G మోడల్ OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT-600 కెమెరాను కలిగి ఉంది.

దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సోనీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ AI బెస్ట్‌ ఫేస్‌, AI అల్ట్రా క్లారిటీ, AI స్మార్ట్‌ రిమూవల్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫీచర్‌లు ఫోటోను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సాయం చేస్తాయి.

కెమెరా విభాగంతోపాటు బ్యాటరీ పైనా రియల్‌మి దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 45W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జర్‌తో 1 నుంచి 50 శాతం వరకు కేవలం 27 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయవచ్చని రియల్‌మి చెబుతోంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ డ్యూయల్ 5G సిమ్ కార్డులను సపోర్టు చేస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం OReality ఆడియో టెక్నాలజీతో కూడిన డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

రియల్‌మి 14 ప్రో లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. IP65 రేటింగ్తో డస్ట్‌ మరియు వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌ తరహాలోనే ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.

రియల్‌మి 14 ప్రో లైట్‌ 5G ధర, సేల్‌ వివరాలు :
రియల్‌మి 14 ప్రో లైట్‌ 5G ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. ప్రస్తుతం రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 14 Pro Lite 5G Smartphone launched with AI Camera Features and snapdragon 7s Gen 2 Chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X