Realme 14 Pro Series ఈ ఫోన్ కెమెరాలు, ఫీచర్‌ల గురించి తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ చేస్తారు..!
రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లోకి రియల్‌మి 14 ప్రో 5G సిరీస్ (Realme 14 Pro Series) విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కలర్ ఛేంజింగ్ వేరియంట్ ఫీచర్‌తో లాంచ్ అయింది. మరియు ట్రిపుల్ ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంది. ఈ సిరీస్ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్‌లు చేసుకొనేందుకు అవకాశం ఉంది.
రియల్‌మి 14 ప్రో 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు కలర్ ఛేంజింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. టెంపరేచర్ 16 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ బ్యాక్ ప్యానల్ వైట్ నుంచి బ్లూ కలర్‌లోకి మారుతుంది. అయితే టెంపరేచర్ 16 కంటే అధికంగా ఉంటే బ్లూ నుంచి వైట్ కలర్‌లోకి తిరిగి మారిపోతుంది.

రియల్‌మి 14 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ (Realme 14 Pro 5G) 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7i రక్షణను పొందుతుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ లో లాంచ్ అయింది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. మరియు ఈ ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై 6, GPS, QZSS, Glonass, Beidou, Galileo, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ Hi-Res సర్టిఫికేషన్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. IP66+IP68+IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌గా ఉంది.
రియల్‌మి 14 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ (Realme 14 Pro Plus 5G) 6.83 అంగుళాల 1.5K (1272*2800) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1500 నిట్స్ బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7i రక్షణను పొందుతుంది.
ఈ ప్రో మోడల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయింది.

ప్రో మోడల్ నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అంగుళాల అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 1/1.56 అంగుళాల 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 8MP సోనీ IMX896 అల్ట్రావైడ్ లెన్స్‌ను అమర్చారు.
దీంతోపాటు OIS, 3X ఆప్టికల్ జూమ్, 6X లాస్‌లెస్ జూమ్‌తో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై 6, GPS, QZSS, Glonass, Beidou, Galileo, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. మరియు IP66+ IP68+IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

రియల్‌మి 14 ప్రో 5G సిరీస్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి 14 ప్రో 5G 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. ఈ ఫోన్ పెర్ల్ వైట్, జైపూర్ పింక్, సూడో గ్రే రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మి 14 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34999 గా ఉంది. బికనీర్ పర్పుల్, పెర్ల్ వైట్, సూడో గ్రే రంగుల్లో లభిస్తుంది.

ఈ సిరీస్ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి జనవరి 22 వ తేదీ అర్ధరాత్రి వరకు అవకాశం ఉంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా అధికారిక స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








