Home
Mobile

బెస్ట్‌ వాటర్‌ ప్రూఫ్‌, 6000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా 5G ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్‌..!

భారత్‌ మార్కెట్‌ లో గత సంవత్సరం డిసెంబర్‌ లో బడ్జెట్‌ రేంజ్‌ లో రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. రూ.15000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చినా.. అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లను కలిగి ఉంది. అల్ట్రా వాల్యూమ్ మోడ్‌, IP69 రేటింగ్‌, 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ వేరియంట్స్ :
ప్రస్తుతం రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.14999, 8GB ర్యామ్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది.

Realme 14X 5G Smartphone gets Rs1000 discount on flipkart

బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ను అన్ని బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.13,999 గా ఉండనుంది. మరో వేరియంట్ ధర రూ.14999 గా ఉంటుంది. అదే విధంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్ క్రిస్టల్‌ బ్లాక్‌, గ్లోల్డెన్‌ గ్లో, జావెల్‌ రెడ్‌ రంగుల్లో లభిస్తుంది.

రియల్‌మి 14X 5G పూర్తి వివరాలు :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ (Realme 14X 5G Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల (1604*720 పిక్సల్స్‌) HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 625 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ తో అందుబాటులో ఉంది.

Realme 14X 5G Smartphone gets Rs1000 discount on flipkart

3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 5.0 ను కలిగి ఉంది. మరియు ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే వీలుంది. ఈ ఫోన్‌ 2 అండ్రాయిడ్ OS అప్‌డేట్‌ లు, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందుకోనుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రియల్‌మి 5G హ్యాండ్‌సెట్‌ f/1.8 అపేచర్‌తో 50MP OmniVision OV50D ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్‌ ఎయిర్‌ గెశ్చర్స్‌తోపాటు, రెయిన్‌ వాటర్ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ ఫోన్‌ డిస్‌ప్లేను నియంత్రించవచ్చు.

భారీ బ్యాటరీ :
రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. బడ్జెట్‌ ధరలో భారీ బ్యాటరీతో అందుబాటులో ఉన్న ఫోన్‌గా గుర్తింపు పొందింది. అయితే నాలుగు సంవత్సరాలపాటు బ్యాటరీ హెల్తీగా ఉంటుందని రియల్‌మి చెబుతోంది.

వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. రూ.15000 కంటే తక్కువ ధరలో బెస్ట్ వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌గా నిలిచింది. డిజైన్‌ పరంగాను ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ఈ ఫోన్‌ను రూపొందించారు. మిలిటరీ గ్రేడ్ షాక్‌ రిసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో ఎఫెక్ట్స్‌ కోసం అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 14X 5G Smartphone gets Rs1000 discount on flipkart with IP69 Rating
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X