ధర రూ.14999 కే సూపర్ వాటర్ రెసిస్టెన్స్ 5G స్మార్ట్‌ఫోన్.. 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 OS సహా..!!
రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ ఇవాళ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ IP69 రేటింగ్‌తో విడుదలైన బడ్జెట్ రేంజ్ హ్యాండ్‌సెట్‌గా గుర్తింపు పొందింది. ఫలితంగా మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ టెస్ట్‌ను పూర్తి చేసుకుంది.
రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. తొలి సేల్ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 22 వరకు జరగనుంది. ఇందులో భాగంగా అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులతో రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ Realme.com మరియు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై సంవత్సరం పాటు వారంటీని పొందవచ్చని రియల్‌మి తెలిపింది. ఈ రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ గ్లోల్డెన్ గ్లో, క్రిస్టల్ బ్లాక్, జ్యువెల్ రెడ్ రంగుల్లో లభిస్తుంది.
రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1604*720 పిక్సల్స్ రిజల్యూషన్, 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది.

రియల్‌మి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో విడుదల చేశారు. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే వీలుంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 5.0 ను కలిగి ఉంటుంది. రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని రియల్‌మి తెలిపింది. ఈ ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగం పరంగా f/1.8 అపేచర్‌తో 50MP OmniVision OV50D ప్రైమరీ కెమెరా, f/2.0 అపేచర్‌తో కూడిన 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. నాలుగు సంవత్సరాలపాటు బ్యాటరీ హెల్తీగా ఉంటుందని రియల్‌మి హామీ ఇస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఎయిర్ గెశ్చర్స్‌ను కూడా సపోర్టు చేస్తుంది. మెరుగైన ఆడియోను అందించేందుకు వీలుగా 200 % అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కలిగి ఉంది. IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో IP69 రేటింగ్ కలిగిన తొలి ఫోన్ ఇదేనని సంస్థ చెబుతోంది.


Click it and Unblock the Notifications








