రూ.13899 ధరకు 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, IP69 రేటింగ్ స్మార్ట్‌ఫోన్..!
రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్ లో ఈ సంవత్సరం అనేక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. దీంతోపాటు మిడ్, ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ లోనూ అనేక ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇటీవలే రియల్‌మి నార్జో 90 5G సిరీస్ ను తీసుకొచ్చింది. అయితే గత సంవత్సరం రియల్‌మి నుంచి లాంచ్ అయిన రియల్‌మి 14x 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.15 వేల ధరలో ఫోన్ కోసం చూస్తున్న యూజర్లు ఈ ఫోన్‌ను కూడా పరిశీలన చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.
ప్రస్తుతం అమెజాన్‌లో రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ (Realme 14x 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14799 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ గోల్డెన్ గ్లో, జువెల్ రెడ్ కలర్ వేరియంట్స్ ధర రూ.14999 గా ఉంది. అదే క్రిస్టల్ బ్లాక్ కలర్ వేరియంట్ ధర రూ.15499 గా ఉంది.

రూ.900 కూపన్ డిస్కౌంట్ :
ఈ ఫోన్ పై అమెజాన్ రూ.900 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫలితంగా రూ.13899 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే హైఎండ్ మోడల్‌ను రూ.14099 ధరకు కొనుగోలు చేయవచ్చు.
HD+ డిస్‌ప్లే, IP69 రేటింగ్ :
రియల్‌మి 14X 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది. IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఎయిర్ గెశ్చర్స్ :
బడ్జెట్ ధరలో మెరుగైన వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా భావించవచ్చు. ఈ ఫోన్ డిస్‌ప్లే రెయిన్ వాటర్ టచ్ సపోర్టును కలిగి ఉంది. అంటే తడి చేతులతో ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్ ఎయిర్ గెశ్చర్స్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ రియల్‌మి ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 5.0 పై పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందుతుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ప్రధానంగా 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం అల్ట్రా వాల్యుమ్ మోడ్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








