Home
Mobile

అడ్వాన్సడ్‌ ఫీచర్‌లతో రియల్‌మి 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు.. భారత్ మార్కెట్‌లో త్వరలో విడుదల..!

Realme 15 Series : రియల్‌మి ఇండియా నుంచి త్వరలో రియల్‌మి 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానుంది. ఈ సిరీస్‌ గురించి సంస్థ తాజాగా టీజర్‌ షేర్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 15 5G, రియల్‌మి 15 ప్రో 5G మోడల్స్‌ లాంచ్ కానున్నాయి. అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

రియల్‌మి అందించిన వివరాల ఆధారంగా రియల్‌మి 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కట్టింగ్‌ ఎడ్జ్‌ కెమెరా ఫీచర్‌లతోపాటు అడ్వాన్సడ్‌ AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు శక్తివంతమైన చిప్‌సెట్‌తోపాటు మెరుగైన కెమెరాలను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Realme 15 5G and realme 15 pro 5G smartphones launch confirmed in india

కెమెరా విభాగం పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. లైటింగ్ సహా అన్ని విధాలుగా ఆకట్టుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ మార్కెట్‌లో రియల్‌మి 15 సిరీస్‌ విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయితే బేస్‌ వేరియంట్‌ ధర రూ.25 వేలుగా ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్‌ ధర రూ.30 వేలుగా ఉంటుందని తెలుస్తోంది.

* రియల్‌మి నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌లోకి రియల్‌మి GT 7 సిరీస్‌ ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి GT 7, GT 7T, GT 7 డ్రీమ్‌ ఎడిషన్‌ కూడా విడుదల అయింది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.

రియల్‌మి GT 7 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 6000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. 120W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 40 నిమిషాల్లో 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని రియల్‌మి చెబుతోంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా (OIS), 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.46,999 గా ఉంది.

* రియల్‌మి GT 7 డ్రీమ్ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా రియల్‌మి GT 7 తరహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే డిజైన్‌ లో కొన్ని మార్పులను గమనించవచ్చు. ఈ ఫోన్ ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో రియల్‌మి GT 7T 5G ఫోన్‌ కూడా అందుబాటులో ఉంది.

* రియల్‌మి GT 7T స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 Max చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ 120W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.34,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.41,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 15 5G and realme 15 pro 5G smartphones launch confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X