7000mAh భారీ బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా, వాటర్ ప్రూఫ్, గేమింగ్ ఫీచర్లతో Realme 15 సిరీస్ విడుదల..!
Realme 15 5G Series : రియల్‌మి 15 సిరీస్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 15 5G, రియల్‌మి 15 ప్రో 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్‌లు 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. IP66 + IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉన్నాయి. దీంతోపాటు గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. మరియు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి.
* రియల్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (Realme 15 5G Smartphone) 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

చిప్‌సెట్, OS :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది. మొత్తంగా 3 స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ AI Party, AI Edit Genie వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ వాయిస్ ఆధారిత ఫోటో ఎడిటింగ్‌ను సపోర్టు చేస్తుంది. వీటితోపాటు AI Motion Control, AI Snap Mode, AI MagicGlow 2.0, AI LandScape, AI Glare Remover వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
* రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ (Realme 15 Pro 5G Smartphone) 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme Ui 6 పైన పనిచేస్తుంది.
మూడు 50MP కెమెరాలు :
ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ MX896 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ షట్టర్ స్పీడ్, కాంట్రాస్ట్, శాచురేషన్ ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది.

ఈ ఫోన్ AI Party, AI Edit Genie వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. వీటితోపాటు AI Motion Control, AI Snap Mode, AI MagicGlow 2.0, AI LandScape, AI Glare Remover వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. మరియు మెరుగైన గేమింగ్ అనుభూతిని అందించేందుకు GT బూస్ట్ 3.0 టెక్నాలజీ, గేమింగ్ కోచ్ 2.0 వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి.

రియల్‌మి 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు IP66 + IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.
* రియల్‌మి 15 సిరీస్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.33999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.38999 గా ఉంది.
Vicky Kaushal just brought the real party to your palms 🎉
— realme (@realmeIndia) July 24, 2025
Presenting the all-new #realme15Pro5G & #realme155G. The ultimate #AIPartyPhone duo.
From crisp clarity to lasting battery and one-of-a-kind AI smarts. These are built to shoot, style, and slay your every party moment.… pic.twitter.com/cx6g79KesY
ప్రో మోడల్ కొనుగోలుపై ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. జులై 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








