Home
Mobile

ఇవాళ్టి నుంచే రియల్‌మి 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల సేల్‌.. ఈ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3 వేల డిస్కౌంట్‌..!

Realme 15 Series Sale : భారత్‌ మార్కెట్‌లో గత వారం రియల్‌మి 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఇందులో రియల్‌మి 15, రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లు బెస్ట్ వాటర్ ప్రూఫ్‌, 7000mAh భారీ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మరియు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.

రియల్‌మి 15 సిరీస్‌ సేల్‌ ఇవాళ (జులై 30 వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్ 8GB/128GB ధర రూ.25999, 8GB/256GB ధర రూ.27999, 12GB/256GB ధర రూ.30999 గా ఉంది. రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Realme 15 5G series features

ప్రో మోడల్‌ 8GB/128GB వేరియంట్ ధర రూ.31999, 8GB/256GB ధర రూ.33999, 12GB/256GB ధర రూ.35999, 12GB/512GB ధర రూ.38999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

డిస్‌ప్లే వివరాలు :
రియల్‌మి 15 5G మరియు ప్రో మోడల్‌ ఫోన్‌లు 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2500Hz ఇన్‌స్టంట్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Realme 15 5G series features

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ సిరీస్‌ బేస్‌ వేరియంట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300+ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అదే ప్రో మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌లు 12GB LPDDR4x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తాయి. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తాయి.

కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా బేస్‌ వేరియంట్‌ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్‌ లెన్స్‌, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అదే ప్రో వేరియంట్‌ 50MP సోనీ MX896 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Realme 15 5G series features

ఈ ఫోన్‌లు AI Party, AI Edit Genie వంటి AI (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఫీచర్‌లను కలిగి ఉంది. వీటితోపాటు AI Motion Control, AI Snap Mode, AI MagicGlow 2.0, AI LandScape, AI Glare Remover వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. GT బూస్ట్‌ 3.0 టెక్నాలజీ, గేమింగ్ కోచ్‌ 2.0 వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

7000mAh భారీ బ్యాటరీ :
రియల్‌మి 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తాయి. IP66 + IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 15 5G series with 7000mAh battery sale to start from today in india here is the bank deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X