బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్.. 50MP సోనీ కెమెరా, 80W ఛార్జింగ్ సపోర్టుతో సహా..!
రియల్‌మి ఇండియా నుంచి రియల్‌మి 15 సిరీస్ లో భాగంగా తొలుత 15 5G, 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లు విడుదల అయ్యాయి. అయితే ఇటీవలే రియల్‌మి 15T 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో రియల్‌మి 15 సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. తాజాగా వచ్చిన రిపోర్టు ఆధారంగా త్వరలో రియల్‌మి 15 లైట్ 5G స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది.
ఈ రిపోర్టు ఆధారంగా :
రియల్‌మి 15 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (Realme 15 Lite 5G Smartphone) గురించి Expertpick (సుధాన్షు అంబోర్ ఆధారంగా) అనేక వివరాలను అందించింది. ఈ రిపోర్టు ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల ఫుల్ HD+ ( 1080 x 2400 పిక్సల్స్ ) OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

మూడు కలర్ వేరియంట్స్ :
ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP65 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉండే అవకాశం ఉంది. మరియు ఎలక్ట్రిక్ పర్పుల్, గ్లిట్టర్ గోల్డ్, శాటిన్ గ్రీన్ కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
రియల్‌మి 15 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీ తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 OS పైన పనిచేసే అవకాశం ఉంది.
50MP సోనీ OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP LYT 600 ప్రైమరీ కెమెరా, 2MP మోనో లెన్స్ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
80W ఛార్జింగ్ సపోర్టు :
బ్యాటరీ, ఛార్జింగ్ ఫరంగా త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్న రియల్‌మి 15 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్పీకర్ లతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
రియల్‌మి 15 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 ధరకు విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు విడుదల కానుందనే కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








