Home
Mobile

రియల్‌మి నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. తాజాగా కీలక వివరాలు లీక్..! అయితే...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ రియల్‌మి (Realme India) నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇటీవలే వెల్లడి అయ్యాయి. రియల్‌మి 15 సిరీస్‌ ఫోన్‌లు ఈ సంవత్సరం జులైలో అందుబాటులోకి వచ్చాయి. అనంతరం సెప్టెంబర్‌ లో రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్‌ అయింది. అక్టోబర్‌లో రియల్‌మి 15x స్మార్ట్‌ఫోన్‌, అనంతరం రియల్‌మి 15 ప్రో 5G ప్రత్యేక వెర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది.

అయితే త్వరలో ఈ సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ తాజాగా అమెజాన్‌ లో లిస్టింగ్‌ అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు Gadgets 360 ద్వారా వెల్లడయ్యాయి. ఇందులో స్పెసిఫికేషన్‌ లు, ధర సహ అనేక వివరాలున్నాయి.

Realme 15 lite 5G smartphone listed on amazon expected specifications in india

డిస్‌ప్లే వివరాలు :
అమెజాన్‌ లో లిస్టింగ్‌ ఆధారంగా రియల్‌మి 15 లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ ( Realme 15 lite 5G Smartphone ) 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ముందు వైపు పంచ్‌ హోల్‌ కటౌట్ డిజైన్‌ తో విడుదల కానుంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ రియల్‌మి లైట్‌ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8000 ప్రాసెసర్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని ఈ లిస్టింగ్ ఆధారంగా తెలిసింది.

రెండు 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ 20X డిజిటల్‌ జూమ్‌ తో 50MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లు :
కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి 15 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుందని సమాచారం. భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ తో పాటు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 187 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది.

ఎంత ధరకు అందుబాటులోకి వస్తుంది? :
అమెజాన్‌ లిస్టింగ్ ఆధారంగా రియల్‌మి 15 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే అమెజాన్‌ లో రూ.17999 ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రియల్‌మి 15 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో విడుదలపై ఇప్పటి వరకు రియల్‌మి సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతోపాటు ఈ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్ల పై ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 15 lite 5G smartphone listed on amazon expected specifications in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X