రియల్‌మి 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. పూర్తి వివరాలు..!
రియల్‌మి భారత్‌లో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. బుధవారం భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో రియల్‌మి 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను (Realme 15 pro 5G Game of Thrones limited Edition) లాంచ్ చేసింది. రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ జులైలో విడుదల కాగా.. తాజాగా లిమిటెడ్ ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది.
రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఎక్లూజివ్ బ్లాక్, గోర్డ్ స్టైలింగ్‌ను కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్ చుట్టూ 3D డిజైన్‌తో డ్రాగన్ క్లా బోర్డర్, నానో మోటిఫ్‌లను కలిగి ఉంది. మూడు కెమెరా లెన్స్‌ల చుట్టు రింగ్స్ తరహా డిజైన్ ఉంది. బ్యాక్ ప్యానల్ దిగువున గేమ్ ఆఫ్ థ్రోన్స్ షో హౌస్ టార్గారియన్ సింబల్ ఉంది.

రియల్‌మి వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ లెదర్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంది. మరియు ఈ ప్యానల్ కలర్ చేంజింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ సాధారణంగా బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కలర్ లో మార్పులను గుర్తించవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ కూల్ టోన్ GOT ప్రేరేపిత స్టాక్ ఐస్ UI థీమ్ లేదా Targaryen డ్రాగన్ ఫైర్ UI థీమ్‌ను పొందవచ్చు. దీంతోపాటు గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాల్‌పేపర్స్‌తోపాటు ఐకాన్స్‌ను కూడా పొందవచ్చు. అయితే ఈ ఫోన్ స్టాండర్డ్ మోడల్ తరహా ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 144Hz రీఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ లిమిటెడ్ ఎడిషన్ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 12GB LPDDR4x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీతో సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 50MP సోనీ IMX896, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP66+ IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. రియల్‌మి వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్‌తోపాటు కింగ్ హ్యాండ్ పిన్, ఐరెన్ థ్రోన్ ఫోన్ స్టాండ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్రాండ్‌తో కూడిన స్టిక్కర్లు, పోస్ట్ కార్డులు, ఇతర ఉపకరణాలను కూడా పొందవచ్చు. డిజైన్ పరంగా స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే అనేక అంశాలను గుర్తించవచ్చు.


Click it and Unblock the Notifications








