50MP కెమెరా, 7000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రియల్‌మి ఫోన్.. వచ్చే వారంలో విడుదల..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి జులై 24 వ తేదీన రియల్‌మి 15 సిరీస్ (Realme 15 Series) విడుదల కానుంది. ఈ సిరీస్‌లో రియల్‌మి 15, రియల్‌మి 15 ప్రో మోడల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ కోసం అనేక వివరాలను సంస్థ వెల్లడిస్తోంది. బ్యాటరీ, డిస్‌ప్లే సహా ఇతర వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ ఫోన్ కెమెరా వివరాలు సహా ఏఐ ఎడిటింగ్ ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.
డిస్‌ప్లే వివరాలు :
ఇప్పటికే వెల్లడయిన వివరాలు ఆధారంగా రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme 15 pro 5G Smartphone) 7.69mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4D కర్వడ్ + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 94 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, 2500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. మరియు ఈ ప్రో మోడల్ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ భారీ బ్యాటరీతోతోపాటు గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది.
7000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు 120fps గేమింగ్ సపోర్టుతోపాటు GT Boost 3.0, గేమింగ్ కోచ్ 2.0 టెక్నాలజీని కూడా కలిగి ఉంది.
50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా :
అయితే తాజాగా రియల్‌మి 15 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరాల వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడిటింగ్ ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

60 FPS 4K వీడియో రికార్టింగ్ :
దీంతోపాటు అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ సహా హై రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని రియల్‌మి తెలిపింది. జుమ్‌లోనూ 4x క్లారిటీ, 2x స్మూత్ ట్రాన్సిషన్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఎడిటింగ్ ఫీచర్లు :
దీంతోపాటు ఈ ఫోన్ అనేక AI ఎడిటింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో AI MagicGlow 2.0, AI Party Mode, AI Edit Genie వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.
రియల్‌మి 15 5G, రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ జులై 14 వ తేదీ రాత్రి 7 గంటలకు విడుదల కానున్నాయి. విడుదల అనంతరం రియల్‌మి ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








