Home
Mobile

7000mAh బ్యాటరీ, అదిరిపోయే కెమెరాలు, ఆకట్టుకొనే డిజైన్‌తో రియల్‌మి 15 సిరీస్‌ ఇవాళే విడుదల..!

Realme 15 Series : రియల్‌మి నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రియల్‌మి 15 సిరీస్ ఇవాళ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 15, రియల్‌మి 15 ప్రో మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఫోన్‌లతోపాటు రియల్‌మి T200 TWS ఇయర్‌బడ్స్‌ (Realme T200 Buds) కూడా విడుదల కానున్నాయి.

భారత్‌లో ఈ ఇవాళ 7:00 PM విడుదల కానున్నాయి. రియల్‌మి యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఈ లాంచ్ ఈవెంట్‌ను వీక్షించవచ్చు. విడుదల అనంతరం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. రియల్‌మి 15 స్మార్ట్‌ఫోన్‌ రూ.25 వేలు, ప్రో మోడల్‌ రూ.30 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులకి వస్తుందని భావిస్తున్నారు.

realme 15 series launch news

రియల్‌మి 15 సిరీస్‌ ఫోన్‌లు వెల్‌వెట్‌ గ్రీన్‌, ఫ్లోయింగ్ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. వీటితోపాటు ప్రో మోడల్‌ ప్రత్యేకంగా సిల్క్‌ పర్పుల్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. రియల్‌మి 15 మోడల్‌ 7.66mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అదే ప్రో మోడల్‌ రూ.7.69mm థిక్‌నెస్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ రెండు మోడల్స్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా రానున్నాయి.

* రియల్‌మి 15 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ AI Edit Genie వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి.

ఈ బేస్‌ వేరియంట్ ఫోన్‌ 6.8 అంగుళాల 1.5k 4D కర్వడ్‌+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు 80W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

realme 15 series launch news

* రియల్‌మి 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్, 256GB లేదా 512GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ AI Edit Genie వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ 6.8 అంగుళాల 1.5k 4D కర్వడ్‌+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా 50MP OIS కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

* రియల్‌మి బడ్స్‌ T200 :
ఈ బడ్స్‌ 12.4mm డైమనిక్ బాస్‌ డ్రైవర్‌లను కలిగి ఉంటాయని రియల్‌మి చెబుతోంది. హైరిజల్యూషన్ సౌండ్‌ కోసం LDAC సపోర్టును పొందుతుంది. మరియు 32dB యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ సపోర్టుతో వస్తుంది. గేమ్ మోడ్‌లో 45ms Low లేటెన్సీని కలిగి ఉంటుంది.

ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 50 గంటల వరకు ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చని రియల్‌మి చెబుతోంది. ఈ బట్స్‌ బ్లూటూత్‌ 5.4, IP55 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ బడ్స్‌ మిస్టిక్‌ గ్రే, స్నోనీ వైట్‌, డ్రీమీ పర్పుల్‌ వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme 15 series and realme T200 buds launching today in india, key specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X