7000mAh భారీ బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా, స్లిమ్ డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువే..!
రియల్‌మి నుంచి ఇటీవల P4 సిరీస్ విడుదల అయింది. ఇందులో భాగంగా రియల్‌మి P4 5G, P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు మోడల్స్ 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే 7000mAh బ్యాటరీతో రియల్‌మి నుంచి మరో ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.
ఎంత ధరలో లాంచ్ కానుంది :
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ (Realme 15T 5G Smartphone) సెప్టెంబర్ 2 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ ఫోన్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.20999 గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ మ్యాటీ టెక్చర్, మ్యూటీ ఫినిష్, 4R డిజైన్ తో అందుబాటులోకి వస్తుంది. మరియు సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది. భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చినా తక్కువ బరువునే కలిగి ఉంటుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ఆధారంగా ఈ ఫోన్ 7.79mm థిక్‌నెస్, 181 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 6.57 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా ఎక్కువ కాంతిలోనూ సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ ముందు వైపు మినీ క్యాప్సుల్ తో లాంచ్ కానుంది. దీని ద్వారా నోటిఫికేషన్‌లను పొందవచ్చు.
50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు 50MP కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఇతర కెమెరాల వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ను పొందుతుంది.
25 గంటలపాటు యూట్యూబ్ చూసుకోవచ్చు :
ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. పూర్తిగా ఛార్జింగ్ చేసి 25.3 గంటల యూట్యూబ్ లేదా 13 గంటలపాటు గేమింగ్ లేదా 128.4 గంటల మ్యూజిక్ కోసం ఉపయోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది. అయితే ఛార్జింగ్ వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఫోన్ IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. పొరపాటున నీటిలో పడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది. ఈ రియల్‌మి ఫోన్ సిల్క్ బ్లూ, సూట్ టైటానియం, ఫ్లోయింగ్ సిల్వర్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. త్వరలోనే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








