7000mAh భారీ బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలతో 5G స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదల కానుందంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి భారత్ మార్కెట్ లో ఇటీవల రియల్‌మి P4 5G, P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. బడ్జెట్ రేంజ్‌లో ఈ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్ సహా అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ సిరీస్ సేల్ కూడా ప్రారంభం అయ్యింది.
దీంతోపాటు రెండు రోజుల క్రితం రియల్‌మి 15000mAh భారీ బ్యాటరీ కాన్సెప్ట్ ఫోన్‌ను ప్రదర్శించింది. దీంతోపాటు చిల్ ఫ్యాన్ ఫోన్ కాన్సెప్ట్ మోడల్‌ను కూడా ఆవిష్కరించింది. చైనాలో జరిగిన ఫ్యాన్ ఫెస్టివల్‌లో ఈ రెండు ఫోన్‌లను ప్రదర్శించింది. ఈ భారీ బ్యాటరీ ఫోన్ ఏకంగా 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని రియల్‌మి తెలిపింది.

ఎప్పుడు విడుదల కానుంది :
భారత్ మార్కెట్‌లో త్వరలో రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 2 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ రూ.20 వేల ధర ధర రేంజ్‌లో అందుబాటులోకి రానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 7.79mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు తక్కువ బరువుతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దీంతోపాటు బడ్జె్ట్ ధరలో అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
భారీ బ్యాటరీ :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దీంతోపాటు 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4000 నిట్స్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్, 10 బిట్ కలర్ డెప్త్ ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు 50MP కెమెరాను కలిగి ఉంటుంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం కూడా 50MP కెమెరాను అమర్చి ఉంటుంది. వెనుక, ముందు వైపు కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. AI Snap Mode, AI Edit Genie వంటి AI ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
భారత్ మార్కెట్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఫోన్ 8GB/128GB ధర రూ.24999, 8GB/256GB ధర రూ.26999, 12GB/ 256GB ధర రూ.28999 గా ఉంది.
రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Hyper Vision చిప్‌ను కూడా అమర్చి ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








