రూ.2 వేల డిస్కౌంట్‌తో 7000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ సేల్!
Realme 15T Smartphone Sale : రియల్‌మి ఇటీవల భారత్ మార్కెట్‌లో రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్, డిస్కౌంట్ల పూర్తి వివరాలు.
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ 12pm నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

మరియు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై EMI లావాదేవీలపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది.
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల ఫుల్ HD+ 4R కంఫర్ట్ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, 2MP సెకండ, 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఈ కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్ Snap Mode, AI Edit Genie, AI Landscape వంటి అనేక ఏఐ ఫీచర్లున్నాయి.
ఆండ్రాయిడ్ 15 OS :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 6nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది.

7000mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 13774 Sq mm గ్రాఫైట్ షీట్, 6050 sq mm ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. రియల్‌మి ఫోన్ 60W SuperVOOC ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఆప్టికల్ ఫింగర్ సెన్సర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్, సిల్క్ సూట్, సూట్ టైటానియం కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications