Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 7000mAh బ్యాటరీ, రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5G స్మార్ట్‌ఫోన్!

Realme 15T 5G Smartphone : భారత్‌ మార్కెట్‌ లో రూ.20 వేల ధర రేంజ్‌ లో రియల్‌మి నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్‌ ఈ సెగ్మెంట్‌ లోనే లభిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 7000mAh బ్యాటరీ, అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ రివర్స్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది. అమెజాన్‌ లో ఈ ఫోన్‌ పై బ్యాంకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ :
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1500 వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Realme 15T Smartphone

ఫుల్‌ HD+ డిస్‌ప్లే :
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ 4R కంఫర్ట్ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. IP66 + IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 6nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP + 50MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. AI Edit Genie, AI Snap Mode, AI Landscape ఫీచర్లు ఉన్నాయి.

7000mAh బ్యాటరీ, 10W రివర్స్‌ ఛార్జింగ్ :
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్‌ 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 60W SUPERVOOC ఛార్జింగ్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది. మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం 13,774 Sq mm గ్రాఫైట్‌ షీట్‌, 6050 Sq mm ఎయిర్‌ఫ్లో వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ఉంది.

ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. ఈ ఫోన్‌ టెక్చర్డ్‌ మ్యాటీ 4k డిజైన్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 15T Smartphone with 50MP selfie camera, 7000mAh battery gets discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X