Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలతో 5G స్మార్ట్‌ఫోన్‌.. ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌లు..!

రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్‌ (Realme 15T Smartphone) భారత్‌లో విడుదల అయింది. ఈ ఫోన్‌ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. మరియు 50MP ప్రైమరీ కెమెరా సహా సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు VC కూలింగ్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

రియల్‌మి 15T స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల ఫుల్‌ HD+ 4R కంఫర్ట్ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లోయింగ్‌ సిల్వర్‌, సిల్క్‌ సూట్‌, సూట్‌ టైటానియం కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Realme 15T smartphone telugu news

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ ఫోన్‌ 6nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది.

50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ వెనుక, ముందు కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు.

వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ :
ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ AI Edit Genie AI Landscape, AI Snap Mode వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. మరియు థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 13774 Sq mm గ్రాఫైట్‌ షీట్‌, 6050 sq mm ఎయిర్‌ఫ్లో వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Realme 15T smartphone telugu news

రివర్స్ ఛార్జింగ్‌ సపోర్టుతో భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 60W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్టుతో 10W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఛార్జింగ్‌ పరంగా మెరుగైన ఫోన్‌గా భావించవచ్చు.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69 రేటింగ్ తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చి ఉంది.

Take a Poll

రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది.

ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ముందస్తు ఆర్డర్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. వీరికి రియల్‌మి బడ్స్‌ T01 ను ఉచితంగా అందిస్తోంది. సెప్టెంబర్‌ 6 వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే EMI లావాదేవీలపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 15T smartphone with 7000mAh battery, 4000 nits peak brightness launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X