Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 7000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. కూలింగ్‌ సిస్టమ్‌, రివర్స్ ఛార్జింగ్‌ సహా!

భారత్‌లో ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. బడ్జెట్‌ సెగ్మెంట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. గత నెలలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి 7000mAh బ్యాటరీతో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మి 15T పేరుతో తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌ లో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

ప్రస్తుతం అమెజాన్‌ లో రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్‌ (Realme 15T Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ పై రూ.1000 కూపన్ కోడ్‌ డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

Realme 15T smartphone gets rs1000 discount

ప్రారంభ ధర రూ.19,999 :
అంటే ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే ఈ డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ ధరలు రూ.19,999, రూ.21,999, రూ.23,999 గా ఉన్నాయి. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

రియల్‌మి 15T స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ 4R కంఫర్ట్ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 4000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే మినీ క్యాప్సుల్‌ ను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్‌ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్ 6nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది.

Realme 15T smartphone gets rs1000 discount

7000mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 13774 Sq mm గ్రాఫైట్‌ షీట్‌, 6050 sq mm ఎయిర్‌ఫ్లో వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 60W SuperVOOC ఛార్జింగ్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

Realme 15T smartphone gets rs1000 discount

ఈ ఫోన్ AI Snap Mode, AI Edit Genie, AI Landscape వంటి ఫీచర్లున్నాయి. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ సూట్‌ టైటానియం, ఫ్లోయింగ్‌ సిల్వర్‌, సిల్క్‌ సూట్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 15T smartphone with 7000mAh Battery, 50MP Selfie camera now gets Rs1000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X