తక్కువ ధరలో 7000mAh బ్యాటరీ, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరా 5G స్మార్ట్‌ఫోన్..!
రియల్‌మి భారత్ మార్కెట్‌లో రియల్‌మి 15 సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రియల్‌మి 15, 15 ప్రో, 15T మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్ (Realme 15x 5G Smartphone) లాంచ్ అయింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే భారీ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, అధిక డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్ ఈ ఫోన్ 6.8 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ పల్స్ లైట్ తో కూడిన క్రిస్టల్ వేవ్ ప్యాట్రన్‌తో అందుబాటులోకి వచ్చింది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్మర్ షెల్ తో కూడిన మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. పొరపాటున కింద పడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్వా బ్లూ, మెరైన్ బ్లూ, మెరూన్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ARM Mali G57 MC2 GPU ను కూడా కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.

రెండు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX852 కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP OV50D40 సెన్సర్‌ను అమర్చారు. ఈ రెండు కెమెరాలు 720p, 1080p రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. టైమ్ ల్యాప్స్, సినిమాటిక్ వీడియో, అండర్ వాటర్ మోడ్, స్లో మోషన్, డ్యూయల్ వ్యూ వీడియోలను సపోర్టు చేస్తాయి.
7000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 60W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఫోన్‌తోపాటు ఛార్జర్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది. బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ ఫోన్ కోసం చూస్తున్నవారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ నాయిస్ క్యాన్సిలేషన్ డ్యూయల్ మైక్‌తో 1115 అల్ట్రా లీనియర్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్, ప్రాక్సిమిటీ, ఇ-కంపాస్ వంటి సెన్సర్‌లు ఉన్నాయి. 8.28mm థిక్‌నెస్, 212 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చని రియల్‌మి చెబుతోంది. అక్టోబర్ 5 వ తేదీ వరకు లాంచ్ ఆఫర్లు ఉంటాయి. రియల్‌మి వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లు, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








