Home
Mobile

200MP కెమెరా, 6.8 అంగుళాల డిస్‌ప్లేతో రియల్‌మి ఫోన్.. పూర్తి వివరాలు..!

రియల్‌మి 16 ప్రో సిరీస్‌ భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో వచ్చే నెలలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రియల్‌మి వెల్లడించింది. అయితే ఇటీవలే చైనా సర్టిఫికేషన్‌ సైట్‌ TENAA లో రియల్‌మి 16 ప్రో + మోడల్‌ లిస్టింగ్‌ అయింది. RMX5130 మోడల్‌ నంబర్‌ను కలిగి ఉంది. Gizmochina ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. రియల్‌మి 16 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల (2800 x 1280 పిక్సల్స్‌) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ (Realme 16 Pro Plus Smartphone) వెనుక వైపు 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 3.5x 50MP టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంటుందని సమాచారం. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Realme 16 Pro Plus

4 సంవత్సరాల అప్‌డేట్స్‌ :
గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌ ఆధారంగా రియల్‌మి 16 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Realme UI 7 పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

రియల్‌మి 16 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ వివరాలు TENAA లిస్టింగ్‌ ఆధారంగా వెల్లడయ్యాయి. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6850mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు IR బ్లాస్టర్‌ కూడా ఉంటుందని సమాచారం.

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? :
రియల్‌మి 16 ప్రో సిరీస్‌ భారత్‌ మార్కెట్‌లో జనవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. రియల్‌మి 16 ప్రో మోడల్‌ ధర భారత్‌లో సుమారుగా రూ.35 వేలుగా ఉండే అవకాశం ఉంది. అదే ప్రో ప్లస్‌ వేరియంట్‌ ధర సుమారుగా రూ.35000 గా ఉండే అవకాశం ఉంది.

* రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లో డిసెంబర్‌ 16 వ తేదీన నార్జో 90 5G సిరీస్‌ విడుదల అయింది. ఇందులో భాగంగా నార్జో 90 5G, నార్జో 90x 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్‌లు 60W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.57 అంగుళాల అమోలెడ్‌ ఫుల్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 మ్యాక్స్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్‌ సెన్సర్‌ ఉన్నాయి. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 16 Pro Plus smartphone specifications tipped ahead of expected launch soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X