200MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌తో రియల్‌మి 16 ప్రో సిరీస్.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
Realme 16 Pro Series Launch Date : రియల్‌మి నుంచి భారత్ మార్కెట్‌లో ఇటీవల రియల్‌మి నార్జో 90 5G సిరీస్ ఫోన్‌లు విడుదల అయ్యాయి. డిసెంబర్ 23, 24 తేదీల్లో ఈ ఫోన్‌ల సేల్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా రియల్‌మి నుంచి కీలక ప్రకటన వచ్చింది. రియల్‌మి 16 ప్రో సిరీస్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.
ఎప్పుడు విడుదల కానుంది? :
భారత్ మార్కెట్‌లో రియల్‌మి 16 ప్రో సిరీస్ జనవరి 6, 2026 న విడుదల కానుంది. అయితే గత మోడల్స్‌తో పోలిస్తే డిజైన్ పరంగా కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెమెరా మాడ్యూల్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ డిజైనర్ నవోటో ఫుకాసావా సాయంతో కొత్తగా అర్బన్ వైల్డ్ డిజైన్‌ను పరిచయం చేస్తున్నట్లు రియల్‌మి తెలిపింది.

ఈ సిరీస్ డిజైన్‌లో బోల్డ్ ఫినిష్, స్టైలింగ్ కు బదులుగా కర్వస్, టెక్చర్స్ తో రోజువారీ వినియోగానికి సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. బయో బేస్ట్ సిలికాన్ మెటీరియల్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, ఆర్చిడ్ పర్పుల్, కామెల్లియా పింక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది.
200MP కెమెరా :
డిజైన్‌తోపాటు కెమెరా విభాగం పరంగానూ ప్రత్యేక ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ సిరీస్ ఫోన్‌లు 200MP కెమెరాను కలిగి ఉంటాయని రియల్‌మి ధ్రువీకరించింది. దీంతోపాటు ఫోటోలు అత్యంత నేచురల్‌గా వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక ఇమేజింగ్ టెక్నాలజీ :
పోర్ట్రియిట్స్, గ్రూప్ ఫోటోలు, లైఫ్‌స్టైల్ ఫోటోలు ఆకట్టుకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. లైట్, కలర్స్‌ను బ్యాలెన్స్ చేసే విధంగా LumaColor image సిస్టమ్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదో ఇన్-హౌస్ పొర్ట్రెయిట్ ఇమేజింగ్ టెక్నాలజీగా తెలుస్తోంది.
రియల్‌మి 16 ప్రో సిరీస్ ప్రాసెసర్, డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ సహా ధర వివరాలపై ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఈ సిరీస్ భారత్‌లో వచ్చే సంవత్సరం జనవరి 6 వ తేదీన లాంచ్ కానున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇటీవలే నార్జో సిరీస్ :
మూడు రోజుల క్రితం భారత్ మార్కెట్‌లో రియల్‌మి నార్జో 90 5G, నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. రియల్‌మి నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సర్, 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీ ఉంది.
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీ ఉంది.


Click it and Unblock the Notifications








