200MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ఆకట్టుకొనే డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల..!
Realme 16 Pro Series Smartphones : రియల్‌మి 16 ప్రో+ 5G సిరీస్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 16 ప్రో, 16 ప్రో ప్లస్ 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్‌లు 200MP కెమెరాలు, 7000mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. డిజైన్ పరంగానూ ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది. తొలి సేల్‌లో భాగంగా ఏకంగా రూ.4 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.
* రియల్‌మి 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Arm Mali G615 GPU ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 50MP కెమెరాను అమర్చారు.
* రెడ్‌మి 16 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్ 6.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఫోన్ క్వాల్‌కాం ఆక్టా కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Adreno 722 GPU ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50MP సెల్ఫీ కెమెరా అమర్చారు. 60fps తో 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
* ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీ :
రియల్‌మి 16 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ సిరీస్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

* రియల్‌మి 16 ప్రో 5G సిరీస్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి 16 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.36999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
రియల్‌మి 16 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.39999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.41999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.44999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
Power, polish, and presence. All in one.
— realme (@realmeIndia) January 6, 2026
The realme 16 Pro+ is finally here with 200MP portrait precision, premium design, and powerful performance together.
Starting at just ₹35,999/-
Pre-book now! pic.twitter.com/jq5qf559aN
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల సేల్ జనవరి 9 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. బేస్ వేరియంట్ మాస్టర్ గోల్డ్, పెబ్బల్ గ్రే, ఆర్చిడ్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది. ప్లస్ మోడల్ మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, కామెల్లియా పింక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








