5 నిమిషాల్లో 2 లక్షల ఫోన్ల అమ్మకాలు,రికార్డు సృష్టించిన Realme 2

గత కొన్ని రోజులుగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఒప్పో రియల్‌మి 2 ఫోన్లు తొలి ఫ్లాష్‌ సేల్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.

|

గత కొన్ని రోజులుగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఒప్పో రియల్‌మి 2 ఫోన్లు తొలి ఫ్లాష్‌ సేల్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ల తొలి ఫ్లాష్‌సేల్‌ను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు రాగా కేవలం 5 నిమిషాల్లోనే 2 లక్షల ఫోన్లు విక్రయమైనట్లు కంపెనీ ప్రకటించింది. రియల్‌మి 2 కొత్త రికార్డు సృష్టించింది. 5 నిమిషాల్లోనే 2 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. ఇందుకు వినియోగదారులకు కృతజ్ఞతలు. తర్వాతి సేల్‌ను సెప్టెంబర్‌ 11న మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నాం అంటూ కంపెనీ ట్వీట్‌ చేసింది.

ఇండియాకి షియోమి నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు, బడ్జెట్ ధరకే !ఇండియాకి షియోమి నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు, బడ్జెట్ ధరకే !

రియల్ మి 2 ఫీచర్లు

రియల్ మి 2 ఫీచర్లు

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర

ధర

3జీబీ ర్యామ్‌/32 జీబీ అంతర్గత మెమొరీ ఉన్న ఫోన్‌ ధర రూ.8,990, 4జీబీ ర్యామ్‌/64 జీబీ అంతర్గత మెమొరీ ఉన్న ఫోన్‌ ధరను రూ.10,990గా నిర్ణయించారు.

అక్టోబర్‌లో డైమండ్‌ బ్లూ వేరియంట్‌..

అక్టోబర్‌లో డైమండ్‌ బ్లూ వేరియంట్‌..

డైమండ్‌ బ్లాక్‌, డైమండ్‌ రెడ్‌ వేరియంట్లలో ఈ ఫోన్లను తీసుకొచ్చారు. అక్టోబర్‌లో డైమండ్‌ బ్లూ వేరియంట్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

4జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌

4జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌

రియల్ మి 2 స్మార్ట్‌ఫోన్‌లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 4జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు.

కెమెరా

కెమెరా

వెనుక భాగంలో 13,2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో 4230 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని అమర్చారు.

షియోమి రెడ్ మి నోట్ 5కి గట్టి పోటీ

షియోమి రెడ్ మి నోట్ 5కి గట్టి పోటీ

కాగా ఈ స్మార్ట్‌ఫోన్ షియోమి రెడ్ మి నోట్ 5కి గట్టి పోటీనివ్వనుంది. రియల్‌ మి 1 డివైస్‌ భారీ విక్రయాలను నమోదు చేయగా దీనికి సక్సెసర్‌గా రియల్‌ మి2ను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే.

 

రియల్‌మి-1 సక్సెసర్‌

రియల్‌మి-1 సక్సెసర్‌

రియల్‌మి-1లో మీడియాటెక్‌ హీలియో పీ60 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రియల్‌మి-2లో స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ను అమర్చింది. రియల్‌మి-1లో ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ లేదు. రియల్‌మి-2లో సెన్సర్‌ను తీసుకువచ్చారు.

నోచ్ డిస్‌ప్లే

నోచ్ డిస్‌ప్లే

దీంతో పాటు ఈ ఫోన్లో నోచ్ డిస్‌ప్లే, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఏఐ ఫేషియల్‌ అన్‌లాక్‌ ప్రధాన ఫీచర్లుగా వచ్చాయి. సెప్టెంబర్‌ 11న మధ్యాహ్నం 12 గంటలకు రెండో ఫ్లాష్ సేల్ జరగనుందని కంపెనీ తెలిపింది.

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

మూడు వేరియంట్లలో..

మూడు వేరియంట్లలో..

మూడు వేరియంట్లలో విడుదలైన వీటి ధరలు 3జీబీర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,990, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.10990, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13990గా ఉండనున్నాయి.

Best Mobiles in India

English summary
Oppo sells 200,000 Realme 2 smartphones in 5 minutes; next sale on September 11 more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X