Home
Mobile

రియల్‌మి నుంచి అదిరే ఫీచర్లతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్

చైనా దిగ్గజం ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి త్వరలో మరో సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.

చైనా దిగ్గజం ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి త్వరలో మరో సరికొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. భారత మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించు కోవాలని భారీ ప్లాన్‌ చేస్తోంది. రియల్‌ మి 1, రియల్‌ మి2 రెండు వేరియంట్ల భారీ విజయం అందుకున్న నేపథ్యంలో రియల్‌ మి 2 ప్రొ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ..ఈ మేరకు సంస్థ మీడియాకు ఆహ్వానాలను పంపింది.

సెప్టెంబరు 27న

సెప్టెంబరు 27న

సెప్టెంబరు 27న నిర్వహించనున్న ఈ ఈవెంట్‌లో రియల్‌ మి2 ప్రొపేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుందన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి.

రియల్‌ మి 2 తరహాలోనే ..

రియల్‌ మి 2 తరహాలోనే ..

రియల్‌ మి 2 తరహాలోనే ఈ డివైస్‌ ధరను అందుబాటులో ఉంచనున్నట్టు తెలుస్తోంది. (రియల్‌మి 2 బేసిక్‌ మోడల్‌ధర రూ. 8,990, 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ.10,990) అంతేకాదు వేగవంతమైన పనితీరును అందించడానికి కొత్త సాక్‌ తో రాబోతోందిట.

రియల్ మి 2 ఫీచర్లు

రియల్ మి 2 ఫీచర్లు

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

మూడు వేరియంట్లలో..

మూడు వేరియంట్లలో..

మూడు వేరియంట్లలో విడుదలైన వీటి ధరలు 3జీబీర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,990, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.10990, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13990గా ఉండనున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 2 Pro India launch set for Sept 27, company sends media invite more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X