బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన రియల్‌మి

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. రోజుకో బడ్జెట్ పోన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న నేపథ్యంలో కొత్త ఫోన్ ఎంపిక కాస్తా తర్జన భర్జనగా మారిపోయింది.

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. రోజుకో బడ్జెట్ పోన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న నేపథ్యంలో కొత్త ఫోన్ ఎంపిక కాస్తా తర్జన భర్జనగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ చైనా దిగ్గజం ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి ఈ రోజు ఇండియా మార్కెట్లోకి రెండు ఫోన్లను లాంచ్ చేసింది . రియల్‌ మి 2 ప్రొ,రియల్ మి సి1 పేర్లతో లాంచ్ చేసింది.

 

రియల్‌ మి 2 ప్రొ ధర...

రియల్‌ మి 2 ప్రొ ధర...

మూడు వేరియంట్లలో విడుదలైన వీటి ధరలు 4 జీబీర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 13,990, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.15,990, 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.17,990గా ఉండనున్నాయి.

రియల్‌ మి 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల....

రియల్‌ మి 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల....

రియల్‌ మి 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (2340 x 1080 పిక్సల్స్) ప్యానల్‌తో వస్తోంది. ఎడ్జ్ టు ఎడ్జ్ 19:5:9 యాస్పెక్ట్ రేషియో కారణంగా ఈ డివైస్ గ్రాఫికల్ కంటెంట్‌ను స్టన్నింగ్ విజువల్స్‌తో అందిస్తుంది.స్మార్ట్ మొబైలింగ్‌తో పాటు మల్టీ మీడియా అవసరాలను తీర్చుకునేందుకు ఈ ఫోన్‌ను ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

డ్యుయల్ కెమెరా సెటప్...
 

డ్యుయల్ కెమెరా సెటప్...

రియల్‌ మి 2 ప్రొ 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది.అలాగే ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాణ్యమైన సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తోంది.

బ్యాటరీ,ఆండ్రాయిడ్,ప్రాసెసర్...

బ్యాటరీ,ఆండ్రాయిడ్,ప్రాసెసర్...

రియల్‌ మి 2 ప్రొ ఫోన్ 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.సింగిల్ ఛార్జ్ పై రోజుంతా వచ్చే ఈ బ్యాటరీ హెవీ యూసేజ్‌కు వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1.8 గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కఠినమైన టాస్కులను సైతం సునాయాశంగా పూర్తి చేయగలుగుతుంది. ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో పై ఫోన్ రన్ అవుతుంది.

 

 

రియల్‌ మి 2 ప్రొ ఫీచర్స్...

రియల్‌ మి 2 ప్రొ ఫీచర్స్...

6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

రియల్ మి సి1 ఫీచర్స్(ధర రూ.6,999)...

రియల్ మి సి1 ఫీచర్స్(ధర రూ.6,999)...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

 

 

 

Best Mobiles in India

English summary
Realme 2 Pro is official with Snapdragon 660 and 8 GB RAM.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X