భారీగా తగ్గిన Realme 2 Pro ధర
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి గత ఏడాది తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ Realme 2 Proని లాంచ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి గత ఏడాది తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ Realme 2 Proని లాంచ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1000 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.ఇక ఈ ఫోన్‌ను ఇప్పుడు తగ్గింపు ధరకు ఫ్లిప్ కార్ట్ , రియల్ మి ఈ-స్టోర్స్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు.ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఓ సారి పరిశీలిస్తే..

ధర
4 జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 13,990
తగ్గిన ధర రూ. 12,990
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 15,990
తగ్గిన ధర రూ. 14,990
8 జీబీ, 128 జీబీ స్టోరేజ్
అసలు ధర రూ. 17,990
తగ్గిన ధర రూ. 16,990

6.3 అంగుళాల....
రియల్ మి 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (2340 x 1080 పిక్సల్స్) ప్యానల్‌తో వస్తోంది. ఎడ్జ్ టు ఎడ్జ్ 19:5:9 యాస్పెక్ట్ రేషియో కారణంగా ఈ డివైస్ గ్రాఫికల్ కంటెంట్‌ను స్టన్నింగ్ విజువల్స్‌తో అందిస్తుంది.స్మార్ట్ మొబైలింగ్‌తో పాటు మల్టీ మీడియా అవసరాలను తీర్చుకునేందుకు ఈ ఫోన్‌ను ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

డ్యుయల్ కెమెరా సెటప్...
రియల్ మి 2 ప్రొ 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది.అలాగే ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాణ్యమైన సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తోంది.

బ్యాటరీ,ఆండ్రాయిడ్,ప్రాసెసర్...
రియల్ మి 2 ప్రొ ఫోన్ 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.సింగిల్ ఛార్జ్ పై రోజుంతా వచ్చే ఈ బ్యాటరీ హెవీ యూసేజ్‌కు వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1.8 గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కఠినమైన టాస్కులను సైతం సునాయాశంగా పూర్తి చేయగలుగుతుంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో పై ఫోన్ రన్ అవుతుంది.

ఫీచర్లు...
6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








