బ్రహ్మాండమైన ఆఫర్లతో నేటి నుంచి రియల్‌మి 5i మొదటి సేల్

|

రియల్‌మి సంస్థ 2020 సంవత్సరంలో తన స్మార్ట్ ఫోన్ రియల్‌మి 5i ను గత వారం ఇండియాలో విడుదల చేసింది. ఇప్పుడు దానిని మొదటి సారి అమ్మకానికి ఉంచింది. రియల్‌మి 5i యొక్క మొదటి ఫ్లాష్ సేల్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్‌లో మధ్యాహ్నం 12:00 గంటలకు మొదలుకానున్నది.

రియల్‌మి 5 ఐ

లాంచ్ ఈవెంట్ సమయంలో రియల్‌మి5 ఫోన్‌ను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. తాజాగా విడుదల అయిన రియల్‌మి 5 ఐ ఫోన్ రియల్‌మి 5 మాదిరిగానే అన్ని రకాల ఫీచర్లను అందిస్తున్నది. ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరాలు వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. రియల్‌మి 5i యొక్క మొదటి సేల్స్ లో అందిస్తున్న ఆఫర్ల గురించి మరింతగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

రియల్‌మి 5i: సేల్స్ వివరాలు మరియు ధరల వివరాలు

రియల్‌మి 5i: సేల్స్ వివరాలు మరియు ధరల వివరాలు

ఇండియాలో రియల్‌మి 5i యొక్క ధర రూ.8,999. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈ రోజు అంటే జనవరి 15 న మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్‌లో ప్రారంభం కానున్నది. ఇది ఫారెస్ట్ గ్రీన్ మరియు ఆక్వా బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లలో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంటుంది. ఆఫర్ల విషయానికొస్తే రిలయన్స్ జియో కస్టమర్లు రూ.7,550 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని మోబిక్విక్ ద్వారా కొన్నవారికి 10 శాతం సూపర్ క్యాష్ (క్యాష్‌బ్యాక్) ను కూడా పొందవచ్చు.

 

 

Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో 6.52-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వాటర్‌డ్రాప్ తరహా నాచ్డ్ ఫీచర్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది. రియల్‌మి 5i డిస్‌ప్లేలోని నాచ్ మునుపటి ఫోన్ నాచ్ కంటే 39 శాతం చిన్నగా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మిర్రర్-పాలిష్ రియర్ షెల్‌ను కలిగి ఉండి 3D స్లిమ్ బాడీతో వస్తుంది. దీనికి వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానల్ HD + (720 x 1600 పిక్సెల్స్) రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 AIE చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది.

 

Airtel WiFi Calling : మరింత వేగంగా విస్తరిస్తున్న సర్వీస్Airtel WiFi Calling : మరింత వేగంగా విస్తరిస్తున్న సర్వీస్

ఫీచర్స్ & కెమెరా

ఫీచర్స్ & కెమెరా

రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. ఫోన్ యొక్క స్టోరేజ్ ను విస్తరించడానికి SD కార్డ్ స్లాట్ ఎంపిక కూడా లభిస్తుంది. ఫోటోగ్రఫీ సెషన్ల విషయానికొస్తే రియల్‌మి 5iలో వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ యొక్క వెనుక భాగంలో రియల్‌మి 5s మరియు రియల్‌మి 5 మాదిరిగానే నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉన్నాయి. ఈ రియర్ కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా12 మెగాపిక్సెల్ లెన్స్ తో, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ తో సెకండరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్‌తో జత చేయబడి ఉంటాయి.

 

 

CES 2020: మిడి-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం 5G-ఎనేబుల్డ్ SoC చిప్‌లను ప్రకటించిన మీడియాటెక్CES 2020: మిడి-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం 5G-ఎనేబుల్డ్ SoC చిప్‌లను ప్రకటించిన మీడియాటెక్

బ్యాటరీ & OS

బ్యాటరీ & OS

రియల్‌మి 5i స్మార్ట్ ఫోన్ కొత్తగా ప్రారంభించిన కలర్‌ఓఎస్ 6.1 UIతో పాటు ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్‌కు దగ్గర అనుభవాన్ని అందించే రియల్‌మి UIని త్వరలో పరిచయం చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది రివర్స్ ఛార్జింగ్ మరియు 10W ఛార్జింగ్ మద్దతును అందిస్తుంది.

 

 

RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్

కనెక్టివిటీ

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, డ్యూయల్ సిమ్ సపోర్ట్, వై-ఫై 802.11ac, GPS, బ్లూటూత్, మైక్రో-USB మరియు 3.5mm ఆడియో జాక్ వంటివి ఉన్నాయి. బయోమెట్రిక్ యాక్సిస్ కోసం ఫోన్ వెనుక భాగంలో మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Realme 5i First Sale Start Today: Price in India, Cashback Offers, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X