Realme 6 & 6i స్మార్ట్‌ఫోన్ల మీద భారీ ధర తగ్గింపు!!!

|

ఇండియాలో మిడ్-రేంజ్ విభాగంలో విడుదల అయిన రియల్‌మి స్మార్ట్‌ఫోన్లు రియల్‌మి 6 మరియు 6i యొక్క ధరల మీద ఇప్పుడు తగ్గింపు లభించింది. రియల్‌మి 6 మరియు రియల్‌మి 6i రెండింటి ధరల మీద దాదాపుగా రూ.1,000 తగ్గింపు లభించింది. అయితే రియల్‌మి 6i లో ఒక వేరియంట్ మాత్రమే ఈ తగ్గింపును అందుకుంది. రియల్‌మి6 నాలుగు వివిధ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో మరియు రియల్‌మి 6i రెండు కాన్ఫిగరేషన్లలో ఇండియాలో విడుదల అయ్యాయి. రియల్‌మి 6సిరీస్‌తో మంచి విజయం సాధించింది. ఈ తగ్గింపు ధరల గురుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 6 కొత్త ధరల వివరాలు

రియల్‌మి 6 కొత్త ధరల వివరాలు

రియల్‌మి 6 ఫోన్ ఇండియాలో ప్రారంభించినప్పటి నుండి ఏప్రిల్‌లో GST ధరల పెరుగుదలతో మొదట లాంచ్ చేసిన మూడు మోడళ్ల యొక్క ధరలను రూ.14,999, రూ.16,999, మరియు రూ.17,999లకు పెంచారు. కానీ ఇప్పుడు అన్ని మోడల్ మీద రూ. 1,000 ధర తగ్గింది. ఇందులో బేస్ మోడల్ 4GB ర్యామ్ + 64GB వేరియంట్ యొక్క  ధర రూ.13,999. 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999, మరియు 6GB + 128GB వేరియంట్ ధర రూ.15,999 మరియు చివరగా 8GB + 128GB వేరియంట్ రూ.16,999 ధర వద్ద లభిస్తుంది.

Also Read:Oppo F17 pro:స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని కొత్త శిఖరాలకు చేర్చనున్న ఒప్పో కొత్త ఫోన్Also Read:Oppo F17 pro:స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని కొత్త శిఖరాలకు చేర్చనున్న ఒప్పో కొత్త ఫోన్

రియల్‌మి 6i కొత్త ధరల వివరాలు

రియల్‌మి 6i కొత్త ధరల వివరాలు

రియల్‌మి 6i ఇండియాలో 4 జీబీ + 64 జీబీ కాన్ఫిగరేషన్‌ను రూ.12,999 మరియు 6GB + 64GB కాన్ఫిగరేషన్‌ యొక్క ధరలు రూ.14,999 ధర వద్ద లభించేవి. అయితే ఇప్పుడు రియల్‌మి 6i యొక్క 6GB ర్యామ్ వేరియంట్ మాత్రమే ధర తగ్గింపును అందుకుంది. ఇప్పుడు దీనిని రూ.13,999 ధర వద్ద మరియు బేస్ వేరియంట్ ను అదే రూ.12,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. వీటి కొత్త ధరలు అధికారిక వెబ్‌సైట్‌లో మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అప్ డేట్ చేయబడ్డాయి.

రియల్‌మి 6i 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

రియల్‌మి 6i 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ 6.5-ఇంచ్ ఫుల్-HD + డిస్ప్లేను 1,080x2,400 పిక్సెల్ పరిమాణంలో కలిగి ఉంటుంది.
ఇది 20: 9 కారక నిష్పత్తితో మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో  90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G90T SoC చేత రన్ అవుతూ 30W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతును ఇచ్చే 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులోని మైక్రో SD కార్డు స్లాట్ ను ఉపయోగించి మెమొరీని 256GB వరకు విస్తరించవచ్చు.

రియల్‌మి 6i క్వాడ్ రియర్ కెమెరా సెటప్  

రియల్‌మి 6i క్వాడ్ రియర్ కెమెరా సెటప్  

రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్  ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఫోన్ యొక్క ఇమేజింగ్ మరియు ఫొటోగ్రఫీ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో మొదటి కెమెరా f / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ సెన్సార్,  8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో మరియు పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్  మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

రియల్‌మి 6i 30W ఫ్లాష్ ఛార్జ్‌  బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి 6i 30W ఫ్లాష్ ఛార్జ్‌  బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి 6i లలోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో  వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ మద్దతుతో వస్తుంది. ఇది 30W ఫ్లాష్ ఛార్జ్‌ మద్దతుతో 4,300mAh పెద్ద బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఫోన్ బరువు 195 గ్రాములు.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 6, 6i Mobiles Receives Price Cut in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X