Just In
- 7 hrs ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 7 hrs ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 9 hrs ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
- 11 hrs ago
BSNL రిపబ్లిక్ డే 2021 ఆఫర్లలో ఈ ప్లాన్లపై అదనపు వాలిడిటీ!! త్వరపడండి
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Realme 6, 6Pro కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!
రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 PM IST సమయం వద్ద ప్రారంభమయిన లాంచ్ ఈవెంట్ కార్యక్రమం ద్వారా వీటిని విడుదల చేసారు. రియల్‌మి సంస్థ మొదటిసారి రూ.10,000 ధర విభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ గల ఫోన్లు రియల్‌మి 5 సిరీస్ ను అందించింది.

ఇప్పుడు కంపెనీ 30W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలతో రియల్‌మి6 మరియు రియల్‌మి6 ప్రోలను విడుదల చేసింది.రియల్‌మి 6 మరియు రియల్‌మి 6 ప్రో రెండూ కూడా 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి.
Realme X50 Pro 5G: అదరహో అనిపిస్తున్నసేల్స్ ఆఫర్స్

లభ్యత వివరాలు
ఇండియాలో రియల్‌మి 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క సొంత వెబ్ సైట్ రియల్‌మి.కామ్ ద్వారా వివిధ తేదీలలో జరగునున్నాయి. రియల్‌మి6 ప్రో యొక్క సేల్స్ మార్చి 13 మధ్యాహ్నం 12:00 గంటలకు మరియు రియల్‌మి 6 యొక్క సేల్స్ మార్చి 11 నుంచి మొదలుకానున్నాయి. రియల్‌మి 6 సిరీస్ ఫోన్లు కామెట్ వైట్ మరియు కామెట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్థాయి.
BSNL Rs.551 ప్లాన్: రోజుకు 5GB డేటా ప్రయోజనాలతో

రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మూడు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ మోడల్ రూ.12,999ల ధర వద్ద 6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ మోడల్‌ను రూ.14,999 ధర వద్ద మరియు టాప్ ఎండ్ మోడల్ 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ల యొక్క ధర రూ.15,999 గా నిర్ణయించారు.
వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్ వెర్షన్ కూడా మూడు వేరియంట్లలో విడుదల అయింది. ఇందులో 6 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.16,999 మరియు 6 GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.17,999 కాగా టాప్ ఎండ్ మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.18,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
ఈ వారంలో లాంచ్ అయ్యే స్మార్ట్‌వాచ్ లు ఇవే...

రియల్‌మి6 స్పెసిఫికేషన్స్
రియల్‌మి6 స్మార్ట్‌ఫోన్ ముందు ఫోన్ల మాదిరిగానే 6.5-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్యానెల్ ఫుల్ HD + రిజల్యూషన్‌కు మద్దతును ఇవ్వడమే కాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది 90Hz డిస్ప్లే మద్దతుతో పాటుగా 30W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.అంటే ఈ ఫోన్ల యొక్క బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 60 నిమిషాలు మాత్రమే పడుతుందని కంపెనీ పేర్కొంది.
చిన్న పిల్లల ఆధార్ కార్డును పొందడం ఎలా?

కెమెరా సెటప్
రియల్‌మి6 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G90T SoC ప్రాసెసర్ చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఇది వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో మరియు డీప్ సెన్సార్ల లెన్స్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
WhatsAppలో ప్రొటెక్ట్ బ్యాకప్ ఫీచర్....

రియల్‌మి6 ప్రో స్పెసిఫికేషన్స్
రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లే ఫుల్ HD + రిజల్యూషన్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz మద్దతుతో వస్తుంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,300 అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కొత్త స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశానికి చెందిన NavIC అనే GPS సిస్టమ్ మద్దతుతో వస్తుంది.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని సేవ్ చేయడానికి 5 చిట్కాలు

క్వాడ్ రియర్ కెమెరా సెటప్
రియల్‌మి6 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 సెన్సార్‌ను కలిగి ఉంది.ఈ సెటప్‌లోని రెండవ కెమెరా 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ లు వరుసగా ఉన్నాయి. ఇది 20x హైబ్రిడ్ జూమ్‌కు మద్దతును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన నైట్స్కేప్ 3.0 మోడ్, ట్రైపోడ్ మోడ్ తో వస్తాయి. ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. ఇవి 103 డిగ్రీ కోణంలో సెల్ఫీలను తీయడానికి కూడా అనుమతిని ఇస్తుంది.
యూట్యూబ్ ద్వారా డబ్బును సంపాదించడం ఎలా? సులభమైన చిట్కాలు

కనెక్టివిటీ
రియల్‌మి 6 మరియు రియల్‌మి 6 ప్రో రెండూ కూడా 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. భద్రత కోసం రియల్‌మి రెండు ఫోన్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి యుఐతో రన్ చేయబడతాయి. కనెక్టివిటీ ఎంపికలలో ఇది జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, బ్లూటూత్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, సామీప్య సెన్సార్ మరియు దిక్సూచి / మాగ్నెటోమీటర్ వంటి సెన్సార్లను కలిగి ఉన్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190