Realme 7 Pro మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ నేడే!! త్వరపడండి...
ఇండియాలో రియల్‌మి సంస్థ గత వారంలో మిడ్-రేంజ్ విభాగంలో కొత్తగా రియల్‌మి 7, రియల్‌మి 7 ప్రోలను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో రియల్‌మి 7 యొక్క అమ్మకాలు ఇప్పటికే మొదలుకాగా రియల్‌మి 7 ప్రో యొక్క అమ్మకాలు మొదటిసారిగా నేడు మధ్యాహ్నం 12PM నుంచి ఫ్లిప్కార్ట్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ ద్వారా మొదలుకానున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అతి పెద్ద డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 7ప్రో ధరల వివరాలు
ఇండియాలో గత నెలలో రియల్‌మి 7 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.19,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.21,999. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు నేడు అంటే సెప్టెంబర్ 14 నుండి ఫ్లిప్కార్ట్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు మొదలుకానున్నాయి.

రియల్‌మి 7 ప్రో స్నాప్‌డ్రాగన్ 720 G SoC చిప్ సెట్
రియల్‌మి 7 ప్రో ఫోన్ యొక్క 6.4-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 120HZ టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్యానెల్ 20: 9 కారక నిష్పత్తితో, 480 నిట్స్ ప్రకాశం మరియు 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. అలాగే ఇది అద్భుతమైన గేమింగ్ ప్రాసెసర్ కోసం సరికొత్త స్నాప్‌డ్రాగన్ 720 G SoC చిప్ సెట్ ను కలిగి ఉంది.

రియల్‌మి 7 ప్రో సోనీ IMX682 సెన్సార్ కెమెరా సెటప్
రియల్‌మి 7 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ మెయిన్ కెమెరా మరియు ఎఫ్ / 2.3 అల్ట్రావైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో B/W సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందుభాగంలో F/ 2.0 లెన్స్ తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ కుడి వైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.

రియల్‌మి 7 ప్రో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్స్
రియల్‌మి 7 ప్రో ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,500 mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఇది 3-కార్డ్ లాట్‌కు మద్దతును ఇస్తూ ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతాయి. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది.


Click it and Unblock the Notifications