Realme 7th Anniversary Sale రియల్‌మి ప్రత్యేక సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు..!
రియల్‌మి ఇండియా ఏడో వార్షికోత్సవం సందర్భంగా Realme 7th Anniversary Sale నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు విక్రయిస్తోంది. దీంతోపాటు 2025 చివరి నాటికి మరిన్ని రిటైల్ అవుట్‌లెట్స్, సర్వీస్ సెంటర్‌లను ప్రారంభించాలని భావిస్తోంది. రియల్‌మి ప్రత్యేక సేల్‌లో భాగంగా P3 సిరీస్‌తోపాటు అనేక మోడల్స్‌పై డిస్కౌంట్‌లను అందిస్తోంది.
ఈ రియల్‌మి 7 వ వార్షికోత్సవ సేల్ మే 1 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జరగనుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్‌లను కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి P3 సిరీస్‌లో భాగంగా P3, P3x, P3 ప్రో, P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వీటిపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. దీంతోపాటు రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరకు అందుబాటులోకి వస్తుంది.

రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999 గా ఉంది. ఈ సేల్‌లో బ్యాంకు, కూపన్ ఆఫర్‌లతో రూ.11999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండగా.. ఈ సేల్‌లో రూ.12999 కే కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 ఉండగా.. రూ.4000 డిస్కౌంట్‌తో రూ.18999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. ఈ సేల్‌లో రూ.19999 కే సొంతం చేసుకోవచ్చు.
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. ప్రస్తుతం రూ.22999 కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లు, కూపన్ కోడ్‌తో ఈ తగ్గింపు ధరను పొందవచ్చు.
రియల్‌మి P3 5G :
రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉండగా.. రూ.14999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉండగా.. రూ.15999 కే సొంతం చేసుకోవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉండగా.. రూ.17999 కే సొంతం చేసుకోవచ్చు.
రియల్‌మి నార్జో 80x స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి నార్జో 80x స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.11999 కే ఈ హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు.
రియల్‌మి GT 7 ప్రో :
రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54999 గా ఉంది. ఈ రియల్‌మి ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.49999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్లతో అదనంగా రూ.1250 డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications