Home
Mobile

Realme 9i 5G స్మార్ట్‌ఫోన్ ఫ‌స్ట్ సేల్ ఈ రోజే.. ఆఫ‌ర్ల కోసం చూడండి!

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Realme, ఇటీవ‌ల భార‌త్‌లో Realme 9i 5G మొబైల్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ స్మార్ట్‌ఫోన్లు భార‌త మార్కెట్లో మొదటిసారిగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు IST అమ్మకానికి వ‌స్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 18న దేశంలో ప్రారంభించబడింది. కాగా, ఈ రోజు తొలిసారి సేల్ ప్రారంభం కానున్న సంద‌ర్భంగా ఈ మొబైల్ ధ‌ర‌లు, ఫీచ‌ర్ల‌పై ఓ సారి లుక్కేద్దాం.

Realme 9i 5G

ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 810 SoC ద్వారా ర‌న్ అవుతుంది, దీనితో పాటు గరిష్టంగా 6GB RAM ఉంటుంది. Realme 9i 5G 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 18W క్విక్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.2ని కూడా పొందుతుంది.

Realme 9i 5G మొబైల్ ధ‌ర‌లు, డిస్కౌంట్ ఆఫ‌ర్లు:
భారతదేశంలో Realme 9i 5G మొబైల్ 4GB RAM + 64GB స్టోరేజీ క‌లిగిన బేస్ వేరియంట్ ప్రారంభ ధ‌ర రూ.14,999 గా నిర్ణ‌యించారు. 6GB RAM + 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ వేరియంట్ ధర రూ.16,999 గా నిర్ణ‌యించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఈరోజు నుండి మధ్యాహ్నం 12 గంటలకు IST కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇది మెటాలికా గోల్డ్ మరియు రాకింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Realme 9i 5G

Realme ఆన్‌లైన్ స్టోర్‌లో, ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.1000 తగ్గింపును అందిస్తోంది. ICICI బ్యాంక్ EasyEMI లావాదేవీలతో రూ.1,500 తగ్గింపును కూడా వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ.1000 తగ్గింపును అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI లావాదేవీలతో క‌స్టమర్‌లు రూ.1,500 వరకు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా, రూ.14,250 వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

Realme 9i 5G స్పెసిఫికేష‌న్లు:
రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది లేజర్ లైట్ డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా మెటాలిక్ గోల్డ్ మరియు రాకింగ్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది 8.1mm స్లిమ్ బాడీని కలిగి ఉండి కేవలం 187గ్రా బరువును కలిగి ఉంటుంది. ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6-అంగుళాల 90Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేను 2400×1080 పిక్సెల్‌ల ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పాటు 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 810 5G సిస్టమ్-ఆన్-చిప్ మరియు Arm Mali-G57 MC2 GPU ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత Realme UI 3.0తో రన్ అవుతుంది.

Realme 9i 5G

రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP అల్ట్రా HD ప్రైమరీ లెన్స్, 4cm మాక్రో సెన్సార్ మరియు పోర్ట్రెయిట్ షూటర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.

రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్‌ గరిష్టంగా 128GB స్టోరేజ్ ని కలిగి ఉండి మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS/AGPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G కనెక్టివిటీ, సామీప్యత మరియు యాక్సిలరేషన్ సెన్సార్‌లు ఉన్నాయి. చివరిగా ఇది 18W క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Realme 9i 5G Goes on Sale in India for the First Time Today: Price, Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X