ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా Realme C1 (2019)

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి.. Realme C1 (2019)ను ఇండియా మార్కెట్లో లాంచ్‌ అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో Realme C1 (2019) తొలిసారిగా ఇండియాలో అమ్మకానికి వచ్చింది.

|

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి.. Realme C1 (2019)ను ఇండియా మార్కెట్లో లాంచ్‌ అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో Realme C1 (2019) తొలిసారిగా ఇండియాలో అమ్మకానికి వచ్చింది. నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారత్‌లో ప్రారంభించనున్నట్టు రియల్‌‌మి ప్రకటించింది. కాగా ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి ,ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.ఈ ఫోన్ గతంలో వచ్చిన Realme C1 డివైస్‌ కు సక్సెసర్‌గా Realme C1 (2019) రెండు వేరియంట్లలో కంపెనీ లాంచ్‌ చేసింది. Realme C1 కు మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించి Realme C1 (2019)ను తీసుకొచ్చింది.ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ లేదు కానీ ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు.

ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటే జరిగేది ఇదే..ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటే జరిగేది ఇదే..

ధర

ధర

బేసిక్‌ మోడల్‌ 2జిబి ర్యామ్ ఫోన్‌ను రూ.7,499 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ.8,499గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది.

ఫీచ‌ర్లు

ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ఆఫర్లు

ఆఫర్లు

ఈ ఫోన్ ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.600 డిస్కౌంట్ లభిస్తుంది. ఫోన్ కొనుగోలు చేయబోయే సమయంలో కేవలం 99 రూపాయల ప్రారంభ ధర చెల్లించి వినియోగదారులు ఇన్సూరెన్సు సదుపాయాన్ని పొందవచ్చు.అలాగే ఈ ఫోన్ ను EMI ఆప్షన్ లో కొనాలి అనుకున్న వారికీ రూ. 250 ధర నుంచి ప్రారంభమవుతాయి.

గతంలో విడుదలైన Realme C1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

గతంలో విడుదలైన Realme C1 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Realme C1 (2019) to go on sale at 12pm today on Flipkart.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X